World Cup 2023: జట్టులో నేను లేను.. వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను చూడొద్దనుకున్నా: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Skipper Rohit Sharma recalls 2011 WC Disappointment: 2011లో సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్లో శ్రీలంకపై గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఆ జట్టులో సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి సీనియర్లతో పాటు అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే 2007 టీ20 ప్రపంచకప్ ఆడిన రోహిత్ శర్మకు మాత్రం మెగా టోర్నీలో ఆడే అవకాశం రాలేదు. దీంతో అసంతృప్తికి గురైన రోహిత్.. ప్రపంచకప్ మ్యాచ్‌లను చూడొద్దనుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.
12 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరుగుతోంది. ఇప్పటికే మెగా టోర్నీకి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసిన ఐసీసీ.. ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలో తాజాగా అమెరికాలో జరిగిన ప్రపంచకప్ ప్రచార కార్యక్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ… ‘2003 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ వరకు చేరడం, 2007లో విఫలం కావడం నాకు ఇంకా గుర్తున్నాయి. అయితే 2011 ప్రపంచకప్ ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇంట్లో నుంచే ఆ మ్యాచ్‌లను వీక్షించా. అప్పుడు నేను రెండు రకాలుగా భావోద్వేగానికి గురయ్యా. నేను జట్టులో లేకపోవడంతో చాలా నిరుత్సాహానికి గురయ్యా. ముందుగా మ్యాచ్‌లను చూడొద్దనుకున్నా. కానీ భారత్ అద్భుతంగా ఆడడంతో చూడకుండా ఉండలేకపోయా’ అని తెలిపాడు.
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
Also Read: Nicholas Pooran Fine: పూరన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. కారణం ఏంటంటే!
‘2011లో ఆడకున్నా.. 2015, 2019 ప్రపంచకప్‌లో బరిలోకి దిగా. రెండుసార్లూ సెమీస్‌కు చేరుకున్నాం. అయితే దురదృష్టవశాత్తూ ఫైనల్ చేరలేదు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరుగుతోంది. 2016 టీ20 ప్రపంచకప్ జరిగినా.. వన్డే టోర్నీకి ఉండే ప్రత్యేకత వేరు. ఫాన్స్ ఎంతో ఉత్సాహంగా టోర్నీ కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఇంత దగ్గరగా ట్రోఫీని చూడడం ఇదే మొదటిసారి. టీమిండియాను విజేతగా నిలిపేందుకు అందరం ప్రయత్నిస్తాం. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణిస్తేనే కప్ గెలవగలం. జట్టుగా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.
Indian captain Rohit Sharma with the ICC World Cup 2023 Trophy.
A beautiful picture. pic.twitter.com/UyaAg1r9Y7
— Johns. (@CricCrazyJohns) August 7, 2023
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..