భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా మార్మాంగాలను కోసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ పాశవిక ఘటన కర్ణాటకలోని యశ్వంతపురలో చోటుచేసుకుంది. భార్య.. తన అక్క కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ భర్త ఈ కిరాతకానికి ఒడిగట్టాడు.. కనీసం నిజా నిజాలు తెలుసుకోకుండా క్షణికావేశంలో హత్య చేశిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు బసవేశ్వర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ నగరలో ఈ దారుణం చోటుచేసుకుంది.. నిర్భయ తరహాలోనే భర్తే అతి దారుణంగా భార్య మీద దాడి చేశాడని పోలీసులు తెలిపారు.. అయ్యప్ప, నాగరత్న అనే ఇద్దరు దంపతులు. 12 ఏళ్ల క్రితం వీరికి వివాహమయ్యింది. . వీరికి కుమార్, భూమిక అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాగరత్న రామనగరంలోని ఓ బట్టల దుకాణంలో పనులు చేస్తుండేది. అయ్యప్ప సిటీ మార్కెట్లో కూలీ పనులు చేస్తుండేవాడు..
కొద్ది రోజుల క్రితం నుంచి భార్య మీద అనుమానం మొదలైంది.. నాగరత్న ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతుందని గొడవకు దిగుతుండేవాడు. అయ్యప్ప అక్క కొడుకు చంద్రు. అతను ఓ రోజు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో చంద్రు, నాగరత్నతో సన్నిహితంగా ఉన్నాడు. ఇది అయ్యప్ప చూశాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటూ గొడవకు దిగాడు.. ఇక గొడవ జరిగిన మూడు రోజుల తర్వాత అయ్యప్ప రాక్షసుడిలా మారిపోయాడు. నిద్రలో ఉన్న నాగరత్న మీద దాడి చేశాడు. ఆమె మర్మాంగం మీద చాకుతో కిరాతకంగా పొడిచి.. హత్య చేశాడు.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.. భర్త అయ్యప్పకోసం పోలీసులు గాలిస్తున్నారు.. ఈ ఘటన తో గ్రామం లో జనాలు భయపడుతున్నారు.. అతన్ని వదలవద్దని పోలీసులకు చెబుతున్నారు.. తల్లి, తండ్రి దూరం అవ్వడంతో పిల్లలు అనాధలు అయ్యారు..