ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సెంచరీల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతను నాలుగు సెంచరీలు సాధించాడు. గత 8 ప్రొఫెషనల్ మ్యాచ్‌లను కూడా కలుపుకుంటే అతను మొత్తం 5 సెంచరీలు సాధించాడు. వాటిలో ఒకటి టీ20 లీగ్‌లో జరిగింది. తాజాగా.. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ సాధించి అనేక రికార్డులు సాధించాడు. స్టీవ్ స్మిత్ 191 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది అతని టెస్ట్ క్రికెట్‌లో 36వ సెంచరీ.
ఐపీఎల్ 2025కి ముందు జరిగిన మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌ను అమ్ముడుపోలేదు. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే తాజాగా.. మెగా వేలంలో అమ్ముడుపోలేదు. కానీ.. విజయ్ హజారే ట్రోపీలో మయాంక్ అగర్వాల్ చితక్కొడుతున్నాడు.
భారతీయుల్లో ఒకరితో మరొకరు బాధలు, సంతోషాలు పంచుకునే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అలాగే వస్తువులను కూడా పంచుకుంటాం. అయితే.. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఒకరి నుంచి మరొకరు తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఇది మీ పురోగతి, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి వస్తువులు ఇతరులతో షేర్ చేసుకోకూడదో తెలుసుకుందాం...
దులీప్ ట్రోఫీలో భారత యువ ఆటగాళ్లు ధీటుగా రాణిస్తున్నారు. దేశవాళీ టోర్నీ రెండో రౌండ్ ప్రారంభమైంది. ఇండియా A, ఇండియా D మధ్య గట్టి పోటీ కనిపించింది. ఇండియా B, ఇండియా C తలపడుతున్నాయి. శనివారం భారత్ D ముందు 488 పరుగుల లక్ష్యం ఉంది. ఈ క్రమంలో.. స్టంప్స్ సమయానికి యష్ దూబే15 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, రికీ భుయ్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో గెలుపొందింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యా్చ్లో గుజరాత్ ఓపెనర్స్ చెలరేగారు. ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. శుభ్మాన్ గిల్ (104), సాయి సుదర్శన్ (103) సెంచరీలు చేయడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. గిల్, సుదర్శన్ బ్యాటింగ్ లో ఒకరికొకరు పోటాపోటీగా రన్స్ చేస్తూ వచ్చారు. గిల్ ఇన్నింగ్స్…
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. తన క్రికెట్ చరిత్రలో ఇప్పటికే తన పేరిట కొన్ని రికార్డులు ఉండగా.. మరికొన్ని బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు (118, 109) నమోదు చేశాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్గా కేన్ మామ రికార్డుల్లోకెక్కాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా-నెదర్లాండ్స్ మధ్య లీగ్ దశలో చివరి మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా భారత్ బ్యాటింగ్ కు దిగింది. దీంతో టీమిండియా నెదర్లాండ్ ముందు ఓ భారీ లక్ష్యాన్ని ముందుంచింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య కీలక పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీల మోత మోగించారు. డేవిడ్ వార్నర్ 85 బంతుల్లో 100 పరుగులు చేయగా.. మార్ష్ 100 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇక వికెట్ కోల్పోకుండా పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం 32.2 ఓవర్లలో ఆసీస్ స్కోరు 231/0 ఉంది.
విరాట్ కోహ్లీ వన్డే కెరీర్ లో మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను బ్రేక్ చేయనున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ 49 సెంచరీలు చేశాడు. సచిన్ 463 మ్యాచ్‌ల్లో 49 సెంచరీలు చేయగా.. కోహ్లీ మాత్రం కేవలం 285 మ్యాచుల్లోనే 48 శతకాలు బాదాడు. అయితే ఈ ప్రపంచకప్ టోర్నీలోనే ఆ రికార్డును బ్రేక్ చేయాలని కోహ్లీ చూస్తున్నాడు.