వన్డే వరల్డ్ కప్-2023కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మంచి శుభవార్త అందే ఛాన్స్ కనిపిస్తుంది. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ వన్డే వరల్డ్ కప్ సమయానికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఐపీఎల్-2023 తొలి మ్యాచ్‌లోనే కేన్ విలియమ్సన్ మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో ఈ సంవత్సరం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొత్తానికి కేన్ మామ దూరమయ్యాడు.
Read Also: Pakistan: బక్రీద్ ఎఫెక్ట్.. పాకిస్తాన్‌లో పెరుగుతున్న జంతువుల దొంగతనాలు..
దీంతో.. స్వదేశానికి వెళ్లిపోయిన కేన్ విలియమ్సన్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. రోజురోజుకి అతడి ఫిట్‌నెస్ మరింత మెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక తన గాయం గురించి కేన్ మామ తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చాడు. జిమ్‌లో ట్రైనింగ్ పొందుతున్న వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశాడు.
Read Also: Nandigam Suresh: ఎంపీ నందిగం సురేష్ సవాల్.. బాబు, లోకేష్, పవన్‌లలో ఎవరొచ్చినా రెడీ
తాను 100 శాతం ఫిట్‌నెస్ సాధించడానికి ప్రయత్నిస్తున్నాను.. నెమ్మదిగా కోలుకుంటున్నాను అని కేన్ మామ తెలిపాడు. తన కెరీర్‌లో ఇంతకు ముందు ఎప్పుడు ఇంత పెద్ద గాయం కాలేదు అని అతడు పేర్కొన్నాడు. కాబట్టి పూర్తి ఫిట్‌నెస్ సాధించాడనికి కాస్త సమయం పడుతుంది. ఫిజియో, జిమ్ ట్రైనర్ సాయంతో నా శిక్షణను కొనసాగిస్తున్నాను అని కేన్ విలియమ్సన్ వెల్లడించాడు.
Read Also: Tammareddy Bharadwaj: ప్రాజెక్ట్ కె.. మొదటి రోజే రూ. 500 కోట్లు రాబడుతుంది.. ప్రభాస్ రేంజ్ అది
కచ్చితంగా త్వరలోనే నెట్స్‌లోకి వెళ్తాను అని కేన్ విలియమ్సన్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా విలియమన్స్ సారధ్యంలోని న్యూజిలాండ్ జట్టు 2019 వన్డే వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆక్టోబర్ 5న న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ ఇంగ్లండ్ జట్టుతో తలపడబోతుంది.