ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్.. ఓవర్ స్పీడ్ కి పాల్పడితే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలతో చావగొడతారు. ఈమధ్యకాలంలో వాహనదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ద్విచక్ర వాహనదారులకు, ఆటో వాళ్లకు, ఫోర్ వీలర్ వాహనదారుల వాహనాల ఫోటోలు తీస్తూ వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఇంతటితో ఊరుకోకుండా అత్యవసర సేవలు అందించే ప్రైవేట్ అంబులెన్స్ లను సైతం పోలీసులు వదలడం లేదు. వాటి ఫోటోలు తీస్తూ జరిమానాలను విధిస్తున్నారు.
Read Also: Crime News: దుర్మార్గుడు.. రెండోసారి సెక్స్ కు ఒప్పుకోలేదని భార్యను అక్కడ కోసి
ఓ అంబులెన్స్ కి ఓవర్ స్పీడ్ జరిమానా విధించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు ట్రాఫిక్ బాబాయిలు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నడిపే ప్రైవేటు అంబులెన్స్ లకు పోలీసులు ఫోటోలు కొడుతూ జరిమానాలు వేస్తున్నారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవలు అందించే మాకే ఇలా ఫైన్లు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సరైన గిరాకీలు లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంబులెన్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విధించే జరిమానాలతో వారికి భారం ఎక్కువ అవుతోంది. ఆ జరిమానాలు కట్టడంతో కుటుంబ పోషణ భారంగా మారి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి అత్యవసర సేవలు అందించే ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలకు జరిమానాలు విధించవద్దని కోరుతున్నారు.
Read Also: Crime News: దుర్మార్గుడు.. రెండోసారి సెక్స్ కు ఒప్పుకోలేదని భార్యను అక్కడ కోసి