Cyber Crime: సైబర్ నేరగాళ్ల నుంచి 5.80 లక్షల రూపాయలు రికవరీ చేయడంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విజయవంతమయ్యారు. ఇటీవల కామారెడ్డికి చెందిన రాజేందర్‌కు ఓ అనామక నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్‌లో మాట్లాడిన వ్యక్తులు ముంబై పోలీసులమని పరిచయం చేసుకున్నారు. రాజేందర్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను తాము చెప్పిన ఖాతాకు వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే అరెస్ట్ అవుతావని హెచ్చరించారు.…
కాలం మారుతోంది. గతంలో భర్తలు తాగొచ్చి భార్యలను చితకబాదేవారు. మారిన చట్టాలు, కఠినమైన శిక్షలు అమలవుతుండటం, ఆడవాళ్ల కష్టాలపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టటంతో.. తమ భార్యలపై చేయిచేసుకోవాలంటే భర్తలు జంకుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో అటవీప్రాంతంలో వేటకు వెళ్లిన రాజు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. బండరాళ్ల మధ్య సెల్ ఫోన్ పడిపోవడంతో తీసుకునేందుకు యత్నించిన రాజు... తిరిగి బయటకు రాలేకపోయాడు. పెద్ద బండరాళ్ల మధ్య తలకిందులుగా చిక్కుకుపోయాడు