దేశవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ అట్టహాసంగా కొనసాగాయి. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రజలు డీజేలు, డ్యాన్స్‌లు, విందులతో సందడి చేశారు.
మానవత్వం మంట కలిసింది. ఖాకీ నిర్లక్ష్యానికి మూడు నెలల చిన్నారి బలైంది.ఓ కన్న తల్లి కడుపు కోతకు కారణమైంది. వెయ్యి రూపాయల చలాన్ అభం శుభం తెలియని చిన్నారి ఉసురు తీసింది.యాదగిరిగుట్ట పోలీసుల దాష్టీకం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. జనగామ జిల్లాకు చెందిన దంపతులకు చెందిన మూడు నెలల చిన్నారి పరిస్థితి విషమించడంతో.. ఓ ప్రైవేట్ కారులో హైద్రాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి సమీపంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు…
రూల్ అంటే రూలే.. అవి ఎవరు బ్రేక్ చేసినా వదిలేదు లేదు.. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు పాటించకపోయినా ఫైన్ తప్పదని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.. ఒకప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారిని అక్కడే ఆపి కౌన్సిలింగ్ ఇవ్వడం, చలానాలు రాయడం జరిగేది.. కానీ, ఇప్పుడు రూట్ మార్చేశారు ట్రాఫిక్ పోలీసులు.. కూడళ్ల దగ్గర ఓ పక్కన నిలబడి ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిని ఫొటో తీసి చలానాలు వడ్డిస్తున్నారు. ఇక, ఉన్నతాధికారులకు అక్కడక్కడ మినహాయింపులు ఇచ్చేవారేమో.. కానీ, ఇప్పుడు కామారెడ్డి…