Kalki 2898 AD North America Collections: ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి వారాంతంలో ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. ప్రత్యంగిరా సినిమాస్ ప్రకారం.. కల్కి చిత్రం మొదటి వారాంతంలో 11 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 91 కోట్లు) వసూల్ చేసింది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ మార్కును టచ్ చేయలేదు.
మైథాలాజిక్, సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు నెలకొల్పుతోంది. ఈ చిత్రం ఆదివారం నాటికి (నాలుగు రోజుల్లో) ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. రిలీజ్ అయిన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన కల్కి.. ఈ వారంతానికి రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. కల్కి ప్రభంజనం రెండో వారంలో కూడా కొనసాగనుంది.
Also Read: Kalki 2898 AD: 40 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘కల్కి’ సినిమా స్టార్ట్ చేశారు: ప్రభాస్ పెద్దమ్మ
కల్కిలో ప్రభాస్, దీపికా పదుకోణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా.. హీరోలు విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో, దుల్కర్ సల్మాన్ యోధుడి పాత్రలో మెరిశారు. మృణాల్ ఠాకూర్, అన్నా బెన్, బ్రహ్మానందం, ఆర్జీవీ, రాజమౌళి, కేవీ అనుదీప్, ఫరియా అబ్దుల్లా, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ప్రేక్షకుల పెట్టుకున్న భారీ అంచనాలను కల్కి అందుకుంది.