పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ “కల్కి 2898 ఎడి”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహాభారత ఇతివృత్తం ఆధారంగ తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి లాభాల బాటలో పయనిసస్తోంది. మరి ముఖ్యంగా నైజాం లాంటి ఏరియాలో రూ.60కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవగా రూ.100కోట్ల గ్రాస్ పైగా సాధించి డిస్ట్రిబ్యూటర్ కు కలెక్టన్ల సునామి సృష్టించింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రూ. 1100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
కల్కి సినిమా వచ్చి ఇది మూడో వారం అయినప్పటికీ థియేటర్స్ లో ఇంకా ఈ చిత్రం భారీ వసూళ్లతో అదరగొడుతుంది. వర్కింగ్ డేస్ లో ఎక్కడ డ్రాప్ లేకుండా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వీకెండ్స్ లో మాత్రం దుమ్ము దులుపుతోంది. నిన్న ఈ రోజు హాలిడే కావడంతో కల్కి స్ట్రాంగ్ కలెక్షన్స్ ఉన్నాయి. అదీకాక శంకర్, కమల్ హాసన్ ల పాన్ ఇండియా చిత్రం భారతీయుడు 2కు మిశ్రమ స్పందన రావడంతో ప్రేక్షకులు కల్కి వైపు మొగ్గుచూపుతున్నారు. దీనితో కల్కికి మరో సాలిడ్ వీకెండ్ కుదిరింది అని చెప్పడంలో సందేహాం లేదు. అలాగే బాలీవుడ్ లో ఈ వీకెండ్ తో కల్కి రూ. 250 కోట్ల మార్క్ ని దాటేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. కల్కి విజయంతో బిగ్ బి అమితాబ్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. కల్కికి సంబంధించి సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్టర్ కనిపించినా సొంత ‘X’ ఖాతా ద్వారా రీ ట్వీట్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు అమితాబ్.
Also Read: Mahesh babu: ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..?