స్టార్ హీరోల వారసులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు అంటే అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న నందమూరి బాలయ్య, అక్కినేని నాగార్జున, ప్రిన్స్ మహేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇండస్ట్రీకి పరిచయం ఆయినప్పుడు జరిగిన హంగామా అంత ఇంత కాదు.
కాగా సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రమేష్, మహేష్. రమేష్ హీరోగా అంతగా రాణించకపోవడంతో నిర్మాతగా స్థిరపడ్డారు. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఎదుగుతూ ఇండస్ట్రీని శాసించే హీరోలలో ఒకరిగా, తండ్రి కృష్ణ లెగసీని కంటిన్యూ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ గా పిలవబడుతున్నాడు. ఇప్పుడు ఘట్టమనేని మూడో తరం నటుడిగా ఘట్టమేని గౌతమ్ కృష్ణ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకే ఇప్పటి నుండే తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లనున్నాడు. ఒకవైపు స్టడీస్ కంటిన్యూ చేస్తూ మరో వైపు న్యూయార్క్ లోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అవబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. గతంలో మహేష్ నటించిన 1నేనొక్కడినేలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు గౌతమ్. కానీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉంటాయి. సూపర్ స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం గౌతమ్ కు ప్లస్ పాయింట్, కానీ మహేష్ లెగసీ కంటిన్యూ చేసి, అభిమానుల అంచనాలను అందుకోవాలంటే నటనలో పరిణితి సాధించాలి. అందుకోసమే ఇప్పటి నుండే గౌతమ్ కు శిక్షణ ఇప్పించబోతున్నారు. గౌతమ్ నాలుగేళ్ల పాటు ఈ శిక్షణ తీసుకోనున్నట్టు సమాచారం. కాగా మహేష్ గారాల పట్టి సితార కూడా యాక్టింగ్ పట్ల మక్కువ ఎక్కువ. చూడాలి మరి సితారను ఇండస్ట్రీకి తీసుకువస్తారో లేదో..