iPhone 16: ఆపిల్ కంపెనీ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన iPhone 16 Pro, iPhone 16 Pro Max ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరలతో అందుబాటులో అందిస్తోంది. సాధారణంగా ఇవి అత్యధిక ధరల్లో విక్రయించబడుతాయి. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై వినియోగదారులకు డైరెక్ట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లతో కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఇందులో భాగంగా..
Read Also: IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు శుభారంభం.. తేలిపోయిన సాయి సుదర్శన్..!
ఐఫోన్ 16 Pro 128GB వేరియంట్ సాధారణంగా రూ. 1,19,900 ధరకు లభ్యమవుతుండగా, ఇప్పుడు 8 శాతం తగ్గింపుతో రూ. 1,09,900కి అందుబాటులో ఉంది. అదే విధంగా 256GB వేరియంట్ రూ. 1,29,900కి లభ్యమవుతుండగా, ఇప్పుడు రూ. 1,22,900కి తగ్గించబడింది. ఈ ఆఫర్లు బ్లాక్ టైటానియం, డెసర్ట్ టైటానియం, న్యాచురల్ టైటానియం, వైట్ టైటానియం రంగులలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ఐఫోన్ 16 Pro Max 256GB వేరియంట్ ధర రూ.1,44,900 నుంచి రూ.1,32,900కి తగ్గించబడింది. అదే విధంగా 512GB వేరియంట్ రూ. 1,64,900కి నుండి రూ. 1,57,900కి, 1TB వేరియంట్ రూ. 1,84,900కి నుండి రూ. 1,77,900కి లభించనున్నాయి.
Read Also: Arrowhead Dies: మొసళ్లను సైతం వేటాడే ప్రసిద్ధ పెద్ద పులి “ఆరోహెడ్” ఇక లేదు.. లాస్ట్ వీడియో..!
వీటితోపాటు పాత మొబైల్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా వినియోగదారులు గరిష్టంగా రూ. 48,150 వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది. ఇది మీ పాత ఫోన్ మోడల్, పరిస్థితి, అలాగే మీ లొకేషన్‌లో ఉన్న ఆఫర్ పరిమితులపై ఆధారపడి ఉంటుంది. ఇక బ్యాంక్ ఆఫర్ల విషయంలో.. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 4,000 వరకు తగ్గింపు, Non-EMI లావాదేవీలపై రూ. 2,000 తగ్గింపు, అలాగే అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అదనంగా రూ. 3,000 వంటి భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. పైగా, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు పరిమిత కాలానికి మాత్రమే ఉండే అవకాశం ఉన్నందున, కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.