Crude Oil Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించడంతో.. నిన్న ( జూన్ 22న) హర్మూజ్ జలసంధిని మూసి వేసేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
Read Also: Viral : పిల్లల ఎదుటే భార్యను హింసించిన భర్త.. వీడియో వైరల్
అయితే, తాజా పరిణామాలతో భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమ ఆసియా దేశాలతో భారత దౌత్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్‌కు వెళ్లే ఎగుమతులు భారీగా కూడా భారీగా తగ్గిపోయాయి. ఇరు దేశాలకు కీలక మార్గం అయిన హర్మూజ్ జలసంధి మూత పడుతుండటంతో క్రూడ్ ఆయిల్ ధరలు 80 డాలర్ల ఎగువకు చేరే అవకాశం ఉంది. ఈ వార్తల నేపథ్యంలో గత 5 నెలల్లో చమురు ధరలు సోమవారం (జూన్ 23న) గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7 శాతం పెరిగి 79.12 డాలర్లకు చేరుకోగా.. ఈ పరిణామం ఆసియా మార్కెట్లపై చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరోవైపు, దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. అయితే, ప్రస్తుతానికి నిల్వలు ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకటించడంతో ఊరటనిచ్చినా.. ఈ యుద్ధం మరికొన్ని రోజుల పాటు కొనసాగితే.. భారత్ పై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.