Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీలు నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ రావు, నరేందర్ రెడ్డిల విచారణ ముగిసింది. ముగ్గురు ఈఎన్సీలను ఒకేసారి కూర్చోపెట్టి కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. చేసిన ప్రతిజ్ఞకు న్యాయం చేయాలని… నిజాలను చెరిపి వేయొద్దని కమిషన్ వ్యాఖ్యానించింది. ఇంజనీర్లు పలు డాక్యుమెంట్లను దాచారని కమిషన్ కామెంట్ చేసింది. డిజైన్స్, డీపీఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. అన్నారం, సుందిళ్ల, లొకేషన్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు జరిగిందని కమిషన్ ప్రశ్నించగా.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు లొకేషన్ మార్చినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ ఆదేశాల మేరకు నీళ్లను స్టోరేజ్ చేశామని అధికారులు తెలిపారు. అయితే.. కమిషన్ అడిగిన ప్రశ్నలకు మాజీ ఈఎన్సీ జనరల్ మురళీధర్ రావు గుర్తుకు లేదని సమాధానం ఇచ్చారు. డీపీఆర్ తయారీలో వ్యాప్ కాన్ సంస్థకు పనులు అలాట్ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ అడగగా.. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే వ్యాప్కన్ సంస్థకు DPR పనులను అలాట్ చేశామని అధికారులు వివరించారు.
కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు మౌనంగా ఉండడంతో… మిమ్మల్ని కమిషన్ అరెస్ట్ చేయడం లేదు సమాధానాలను దాచే ప్రయత్నం చేయొద్దని కమిషన్ చెప్పుకొచ్చింది. ఈఎన్సీలు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నలను అడిగారు. అధికారులు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ చూపించి…. నిజమేనా అని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు కమిషన్ చీఫ్. మూడు బ్యారేజీల కాస్ట్ ఎంత? అని కమిషన్ చీఫ్ ప్రశ్నించగా.. 9వేల కోట్లు అని అధికారులు అంటే…కాదని 13వేల కోట్లు అని కమిషన్ వ్యాఖ్యానించింది. వ్యాప్‌కాన్ సంస్థ DPR ఎవరు అప్రూవల్ చేశారన్న కమిషన్ ప్రశ్నకు గత ప్రభుత్వ పెద్దల్లన్న అధికారులు సమాధానం ఇచ్చారు. ఎవరితో సంప్రదించకుండానే అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల లొకేషన్స్ మార్చారు అనే ప్రశ్నకు ఒప్పుకున్నారు అధికారులు. ప్రజల డబ్బులు వృధా అయ్యాయి అని మీరు భావిస్తున్నారా అని అధికారులను అడిగిన కమిషన్.. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని పేర్కొంది. జీవో నెంబర్ 28 పై నలుగురు అధికారులను కమిషన్ ప్రశ్న అడిగితే…. అధికారులు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ ఈఎన్సీ మురళీధర్ పై అసహనం వ్యక్తం చేసిన కాళేశ్వరం కమిషన్ చీఫ్
కమిషన్ అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉంటూ.. గుర్తుకులేదనే సమాధానం చెప్పిన మురళీధర్ రావు.. కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబు గుర్తుకులేదు, జ్ఞాపకశక్తి మందగించిందని మురళీధర్ రావు చెప్పకొచ్చారు. దీంతో.. జ్ఞాపకశక్తి తిరిగి రావాలంటే పుస్తకాలు ఎక్కువగా చదవాలని సూచించారు కమిషన్ చీఫ్. డైలీ న్యూస్ పేపర్స్ చదువుతున్నానని, పుస్తకాలు చదవలేనని మురళీధర్ సమాధానం ఇచ్చారు. పనులను చేయడానికి ఎవరి ఆదేశాలు అమలు చేశారన్న కమిషన్ ప్రశ్నకు.. ప్రభుత్వం ఆదేశాల మేరకని సమాధానం చెప్పారు మురళీధర్ రావు. ప్రభుత్వం అంటే మీ దృష్టిలో ఎవరని కమిషన్ ప్రశ్నించగా.. ప్రభుత్వం అంటే నా దృష్టిలో సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ అని సమాధానమిచ్చారు మురళీధర్ రావు. ప్రభుత్వం అంటే అధికారులా?రాజ్యాంగం తెలీదా, పరిజ్ఞానం లేదా, ప్రభుత్వ ఉద్యోగం చేశావు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషన్ చీఫ్.
Nandamuri Balakrishna: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..