Kakinada Doctor committed Suicide: కాకినాడలో యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్‌నగర్‌కు చెందిన వైద్యుడు నున్న శ్రీకిరణ్ చౌదరి (32) శనివారం గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు అతడిని కాకినాడ జీజీహెచ్‌హెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. ఆస్తి విషయమై శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. రష్యాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన శ్రీకిరణ్.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు.
Also Read: Srisailam: శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు.. పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు!
ఆస్తి విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కల్యాణ్‌కృష్ణ, అతడి అనుచరుడు పెదబాబు, వైసీపీ నేతలు తన కుమారుడిని మోసం చేశారని శ్రీకిరణ్ చౌదరి తల్లి రత్నం ఆరోపిస్తున్నారు. భూవివాదం పరిష్కారానికి వైసీపీ నేతలను సాయం అడిగితే.. భూమి పత్రాలు తీసుకుని డబ్బు రాదని చెప్పారని ఆమె తెలిపారు. వైసీపీ నేతల బెదిరింపులతోనే తన కుమారుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీకిరణ్ తల్లి అంటున్నారు. తమకు న్యాయం చేయాలని మృతి తల్లి కోరుతున్నారు.