గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైకి వెళ్ళిన సంగతి తెలిసిందే.. అయ్యప్ప మాల విరమణ కోసం చరణ్ ముంబైకి చేరుకున్నారని అంతా అనుకుంటుండగా.. ప్రస్తుతం నెట్టింట ఓ క్రేజీ పిక్ ఒకటి వైరల్ అవుతుంది.. మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ప్రేమ్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారనేది ఆసక్తికరంగా మారింది.
ఈరోజు ఉదయం రామ్ చరణ్ ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధివినాయక టెంపుల్ ను సందర్భించారు. అయ్యప్ప మాల విరమణ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, ఆలయ సిబ్బంది చరణ్ కోసం తగిన ఏర్పాట్లు చేశారు. వినాయకుని దర్శనం అనంతరం.. శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలతో పాటు ధోనితో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఆ ఫోటోను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..ఇద్దరు స్టార్స్ ఓకే ఫ్రేమ్ లో మెరియడంతో మురిసిపోతున్నారు. అయితే వీరిద్దరు ఎందుకు కలిశారనే దానిపై ఆరా తీయగా.. ఓ కమర్షియల్ యాడ్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే చరణ్, ధోనీ కలిశారని సమాచారం.. ఇక ఈ షూట్ తర్వాత చరణ్ హైదరాబాద్ కు రానున్నారు.. చరణ్ సినిమాల విషయానికొస్తే..డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలి ఉంది. శంకర్ ‘ఇండియన్ 2’పై ఫోకస్ పెట్డడంతో ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యం అవుతోంది. ఈ చిత్రం తర్వాత ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటించబోతున్నారు.. చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది..