Justice NV Ramana : తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. మహాసభలకు ముందు తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఘటించడం జరిగింది. ఈ మహాసభల్లో ఎంపీ సుజనా చౌదరి, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్,…
తెలుగు భాష సంగీతమైనటువంటి భాష అని.. ఈ మధ్యకాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాషపై పట్టు వీడుతుందన్నారు. రాజకీయ నాయకులు సంక్షేమ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కానీ భాష గురించి ఆలోచించరన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారన్నారు.
కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నా, అప్పటి గాయాలు చాలా మందిని ఇంకా వెంటాడుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొవిడ్ వచ్చినప్పుడు చాలా మంది బతకాలనే ఆశతో ఆస్తులను అమ్మి వైద్యం చేయించుకున్నారని, కానీ ఆర్థికంగా అన్నీ కోల్పోయి ఇంకా ఎందుకు బతికున్నామా అని ఇప్పుడు కుమిలిపోతున్నారని ఆయన అన్నారు.
భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ యూయూ లలిత్ ఆగస్టు 27న బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇప్పుడు మన తెలుగు చిత్రసీమ ఇండియన్ సినిమాపై ఆధిపత్యం చెలాయిస్తుండడమే కాదు.. ప్రపంచ స్థాయి సినిమాలకు కూడా ధీటుగా పోటీనిస్తోంది. ఉన్నత ప్రమాణాలతో రూపొందుతూ.. విశేష ఆదరణను చూరగొనడంతో పాటు కలెక్షన్ల పరంగా సరికొత్త మైలురాళ్ళనే సృష్టిస్తున్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు విదేశాల్లోనూ ఎలా అలజడి సృష్టించాయో అందరూ చూశారు. ఆర్ఆర్ఆర్ అయితే కొన్ని ‘ద బ్యాట్మాన్’ సినిమానే వెనక్కు నెట్టేసింది. అలాంటి మన టాలీవుడ్‌పై భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ…
ఢిల్లీలో జరుగుతున్న న్యాయ సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి. లక్ష్మణ రేఖను దాటడం మంచిది కాదన్నారు. న్యాయమూర్తులు విధి నిర్వహణలో పరిధులు గుర్తించాలి. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థకు వేర్వేరు అధికారాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యం బలోపేతానికి 3 వ్యవస్థలు పనిచేయాలి. పిల్‌లు దుర్వినియోగం అవుతున్నాయి. పిల్‌లు వ్యక్తిగత వ్యాజ్యాలుగా మారాయన్నారు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం అన్నారు.…
తెలంగాణ హైకోర్టులో బార్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిగా హాజరయ్యారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.సమావేశంలో హైకోర్టు చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ తెలంగాణ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు తనకి సన్మానం చేయడం చాలా అనందంగా ఉందన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. ఎక్కడ…
హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ వల్ల హైదరాబాద్ ఖ్యాతి మరింతగా పెరుగుతుందన్నారు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. గచ్చిబౌలి లో IAMC నిర్మాణానికి భూమిపూజ చేశారు చీఫ్ జస్టిస్ ఎన్.వీ. రమణ. భారతదేశంలో మొదటి IAMC అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విశేషం అన్నారు. IAMC నిర్మాణానికి గచ్చిబౌలి లోని ఐకియా వద్ద 3.7 ఎకరాల భూమిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి మంత్రులు…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు పర్యటించారు.. సీజేఐ హోదాలో తన సొంత గ్రామంలోనూ అడుగుకుపెట్టారు.. ఆ తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. తన పర్యటన ముగిసిన తర్వాత.. తన టూర్‌పై రాష్ట్ర ప్రజలకు బహిరంగలేఖ రాశారు జస్టిస్ ఎన్వీ రమణ.. ఏపీలో కాలు మోపినప్పటి నుంచి నాకు లభించిన ఆదరాభిమానాలు.. ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తీరును నేను నా కుటుంబ సభ్యులు ఎన్నటికీ మరువలేమన్న ఆయన.. బంధుత్వాలకంటే…