ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఢిల్లీలో నేడు బీఆర్‌ఎస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పాలమూరు జిల్లాకు చెందిన ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. పాలమూరు జిల్లా కొల్లాపూర్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రసంగించే భారీ బహిరంగ సభలో జూపల్లి తదితరులు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వరదల కారణంగా సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో చేరిక ఆలస్యమైతే భిన్నమైన కోణాల్లో రాజకీయ ప్రచారం జరుగుతుందని భావించిన జూపల్లి కృష్ణారావుకాంగ్రెస్‌లో చేరాకే పెద్ద ఎత్తున కొల్లాపూర్ సభ నిర్వహించాలని తలపెట్టారు.
Also Read : Suriya: కంగువా విషయంలో చిత్ర యూనిట్ ప్రేక్షకులని మోసం చేస్తున్నారా?
అయితే.. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న కాంగ్రెస్‌లో చేరిక వ్యవహారంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు జూపల్లితో పాటు ఆయన వర్గీయులు నిన్న ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే.. జూపల్లి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు, వనపర్తికి చెందిన మేఘారెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లారు. వారి వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి కూడా ఉన్నారు.
Also Read : Redmi 12 5G Launch: 11 వేలకే రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ!