Andhra Pradesh: ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేసిన హిందీ టీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు.. మోసపోయే వాళ్లు అంతకంటే ఎక్కువగా ఉన్నారు. శారీరక ఆనందం కోసం ప్రేమ పేరుతో లొంగదీసుకుంటారు. తీరా అంతా అయిపోయాక నువ్వెవరు అంటారు. ఒకప్పుడు టీనేజ్ వస్తేనే ప్రేమలో పడేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేమకు వయస్సుతో పనిలేకుండా పోయింది. నాలుగు రోజులు ప్రేమించుకున్నామా.. అవసరం తీరిందా.. వదిలేశామా అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఎక్కడో చోట మాత్రం నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అది తక్కువ.
D.K Shivakumar: తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ పర్యటన..
Also Read
ఇదిలా ఉంటే.. ప్రేమ పేరుతో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఓ హిందీ టీచర్ మోసం చేశాడు. అంతేకాదు.. ఆ బాలికను కిడ్నాప్ చేసి, తాళి కూడా కట్టాడు. పెళ్లి చేసుకున్నానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన సోమరాజు అనే వ్యక్తి యండగండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి బాలికపై కన్నేశాడు. విద్యాపాటాలు నేర్పాల్సిన టీచర్ ప్రేమ పాటాలతో ఆ అమ్మాయిని లొంగదీసుకున్నాడు. ఈనెల 19న తన బైక్‌పై ఆ మైనర్ బాలికను ఎక్కించుకొని సోమరాజు తన గ్రామానికి తీసుకెళ్లాడు. తాడేరులోనే బాలిక మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
Israel: అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్, డాక్టర్లను అరెస్ట్ చేసిన ఇజ్రాయిల్..
ఈ ఘటనపై దిశ డీఎస్పీ ఎన్. మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేసిన హిందీ టీచర్ పురెల్ల సోమరాజును రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. తల్లితండ్రులు విదేశాలలో ఉంటే ఇంటి వద్ద ఉండే తమ కుమార్తెల విషయంలో జాగ్రత్త చాలా అవసరమని డీఎస్పీ చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు పాల్పడిన హిందీ టీచర్ ను ఇప్పటికే విధుల నుండి డీఈవో సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!