IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో కెప్టెన్ శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ లు సెంచరీలు చేసిన చివరిలో భారత బ్యాట్స్ మెన్స్ త్వరగా పెవీలియన్ చేరడంతో తక్కువ పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ కు తెరపడింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 465 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమ్ ఇండియాకు కేవలం ఆరు పరుగుల లీడ్ మాత్రమే లభించింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో పోప్ 106 పరుగులతో సెంచరీ చేయగా.. హరి బ్రోక్ ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకొని 99 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అతనికి తోడుగా జెన్నిస్ మిత్ 40 పరుగులు, క్రిస్ వోక్స్ 38 పరుగులతో రాణించారు.
Read Also:IWMBuzz Digital Awards: ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న మాళవిక మోహనన్..!
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ 62 పరుగులు, జో రూట్ 28, కెప్టెన్ బెన్ స్టాక్స్ 20 పరుగులు, కార్స్ 22 పరుగులు, జోష్ టంగ్ 11 పరుగులతో రాణించారు. ఇక టీమిండియా బౌలింగ్ లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా మరోసారి తన మార్క్ బౌలింగ్ ప్రదర్శించాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను 83 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు నెలకొల్చాడు. ఇక బూమ్రాకు తోడుగా ఐపీఎల్ పర్పుల్ క్యాప్ హోల్డర్ ప్రసిద్ధి కృష్ణ 3 వికెట్లు తీసుకోగా, హైదరాబాద్ కి చెందిన స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు నెలకూల్చారు. ఇరు జట్లు నువ్వా.. నేనా.. అన్నట్లుగా పోరాడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎక్కువగా డ్రా దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం టీమిండియా కేవలం ఆరు పరుగులే లీడ్ ఉండడంతో ఇంగ్లాండ్ గెలుపుకు అడ్డుకట్టు వేయాలంటే భారత్ మరోసారి భారీగా పరుగులు రాబట్టాల్సిందే. చూడాలి మరి మిగితా రెండు రోజులు ఈ టెస్ట్ ఎలా కొనసాగునుందో.
Read Also: IND vs ENG: డ్రా దిశగా భారత్, ఇంగ్లాండ్ టెస్ట్..?