Most Expensive Rice: ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఒక్కొక్క రకమైన ఆహార అలవాట్లు ఉంటాయి. అంతెందుకు మన భారత దేశంలోనే ఉత్తరాది భారతీయులు ఎక్కువగా చపాతి, కర్రీ లాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువగా బియ్యం సంబంధించిన ఆహార పదార్థాలని తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఇలా ఉండగా.. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు బియ్యాన్ని ఆహారంగా తినడానికి ఇష్టపడతారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల కొత్త వంగడాలను పండిస్తున్నారు. భారతదేశ మార్కెట్లో కిలో బియ్యం 45 రూపాయల నుండి 200 వరకు ఉంటుందని మనకు తెలిసిందే. అయితే అదే బియ్యం ధర కిలో ఏకంగా రూ.14000 ఉంది అంటే నమ్ముతారా.? అవునండి మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Read Also: IPL 2025 GT: బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్ పటేల్‌ను నియమించుకున్న గుజరాత్ టైటాన్స్
జపనీస్ కిన్మెమై రైస్.. ఈ బియ్యాన్ని జపాన్‌లో అతి తక్కువగా పండిస్తారు. భూమి మీద పండే అత్యంత ఖరీదైన బియ్యంగా ఈ బియ్యం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. జపాన్ లోని టోయో రైస్ కార్పొరేషన్ మొత్తంగా 5 స్పెషల్ వరి వంగడాలను పండిస్తుండగా.. అందులో ఒకటే కిన్మెమ్మె రైస్. ఇక ఈ బియ్యం ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇవి బ్రైన్ రైస్ కంటే చాలా తేలికగా, చాలా చిన్నగా ఉంటాయి. మరో ప్రత్యేకత ఏంటంటే.. బియ్యాన్ని వండే ముందు కడగాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఇవి చాలా తక్కువ సమయంలోనే ఉడుకుతాయి.
Read Also: MS Dhoni Cast Vote: ఇదేం క్రేజ్ భయ్యా.. ఓటు వేయడానికి వచ్చిన ధోనికి ఏకంగా?
ఈ బియ్యాన్ని సాధారణ బియ్యంతో పోలిస్తే.. ఇందులో 1.8 రెట్లు ఫైబర్, 7 రెట్ల విటమిన్ B1 అధికంగా ఉంటాయి. అంతేకాకుండా 6 రెట్లు లిపోపాలిసాకరైడ్ లను కలిగి ఉంటుంది. ఈ రైస్ శరీరంలో సహజ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉండి, రుచి ఆద్భుతంగా ఉంటాయి. కాస్త తీపిగా ఉంటుంది. అంతేకాదు ఇవి తిన్న వెంటనే సులువుగా జిరణం అవ్వడంతోపాటు ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఈ బియ్యం గోధుమ, తెలుపు రంగులో అందుబాటులో ఉంటాయి. ఈ బియ్యం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. మార్కెట్‌లో వీటి ధరలు రకాన్ని బట్టి ఉంటాయి. ఈ బియ్యం కిలోకు 110 డాలర్ల నుంచి 160 డాలర్ల వరకు ఉంటాయి. అంటే మన కరెన్సీలో రూ.9,200 నుంచి రూ.13 వేలకు పైనే.