జనసేన కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. గుంటూరులో నేడు ఉదయం 11గంటలకు జనసేన లీగల్ సెల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొననున్నారు. అయితే.. పార్టీ లీగల్ సెల్‌కి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.
పవన్ చేపట్టబోయే యాత్ర ఏర్పా్ట్లపై సమాలోచనలు.. దసరా రోజు నుంచి యాత్ర చేపట్టాలని గతంలో పవన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. యాత్రకు ఏర్పాట్లు ఇంకా పూర్తి కాకపోవడంతో యాత్ర కొనాళ్ల పాటు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో మరోసారి చర్చించి క్లారిటీ ఇవ్వనున్నారు పవన్.