Jangaon Crime: జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు రామకృష్ణయ్య దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు. అతడిని హత్య చేసింది సుపారీ గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నాలుగు రోజులు తరవాత ఆచూకీ లభ్యమైంది.
బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య గురువారం 15న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. అయినా లాభం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రామకృష్ణయ్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామ శివారులోని మామిడితోట సమీపంలో బైక్‌ను గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పోచన్నపేట నుంచి బచ్చన్నపేటకు బైక్‌పై వెళుతున్న రామకృష్ణను మార్గమధ్యంలో దుండగులు ఆపి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ జరిపి చంపక్ హిల్స్ శివారులో రామకృష్ణ హత్యకు గురైనట్లు గుర్తించారు. భూ వివాదంలో రామకృష్ణ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నాలుగు రోజులు తరవాత ఆచూకీ లభ్యమైంది. శనివారం రాత్రే రామకృష్ణ హత్య జరిగినట్టు, మృతదేహాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఓ బీఆర్ఎస్ నాయకుడితో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీస్కునట్లు సమాచారం. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Read also: Ashes 2023: సూపర్ ఫీల్డ్ సెట్ చేసిన బెన్ స్టోక్స్.. తడిసిపోయిన స్టీవ్ స్మిత్ ప్యాంట్!
రామకృష్ణ గతంలో నర్మెట్ట, రఘునాథపల్లి, భూపాలపల్లి జిల్లాలో ఎంపీడీఓ గా పని చేశారు. ఆ తరవాత ఇంటి వద్దే ఉంటూ సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణలో ఆక్టివ్ పని చేస్తున్నాడు. గ్రామ పంచాయితీ, తదితర ప్రభుత్వ కార్యాలయాల నుండి మంజూరైన నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవాడు. బచ్చన్నపేట మండలంలోని చిన్నారంచర్ల గ్రామ పరిధిలోని ఓ భూమిలో పేదలు గుడిసెలు వేసుకున్న దాంట్లో రామకృష్ణ సపోర్ట్ ఉందనే అనుమానంతో కిడ్నప్ చేసి హత్య చేసినట్లు సమాచారం. రామకృష్ణ ఆర్టీఐ చట్టం ద్వారా అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారని.. ఇదే ఆయన హత్యకు కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కాగా, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రోద్బలంతో రామకృష్ణయ్య కిడ్నాప్ జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆర్టీఐ ద్వారా అధికార పార్టీ నేతల కబ్జాలు వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు. రాజకీయ నేతలను తప్పించుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారమే మృత దేహాన్ని గుర్తిస్తే.. ఇంతవరకు ఎందుకు చూపడం లేదని ప్రశ్నిస్తున్నారు.
RBI : కనిపించకుండా పోయిన రూ.88,000 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు.. స్పందించిన ఆర్‌బీఐ