Nirmal Crime: కుటుంబ కలహాలు ఆనందంగా గడపాల్సిన జీవంతంలో చిచ్చపెడుతున్నాయి. చిన్న చిన్న గొడవకు దారితీయడంతో దాడులు చేసుకుసుకుంటున్నారు. హాస్యంగా అనుకున్న మాటలే విభేదాలకు కారణమవుతున్నాయి. అందరూ కూర్చుని మాట్లాడుకుంటే తీరుపోయే మాటలకు ఆవేశంతో దాడులు చేసుకుని ఒకరినొకరు చంపుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. ఏదైనా గొడవలకు, కుటుంబాల మధ్య కలహాలు జరిగితే దాడులు ప్రతి దాడులు చేసుకుంటారు. కానీ నేను చెప్పే అమ్మాయి మాత్రం ఏకం ఆసిడ్ తో దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. కుటుంబ కలహాలతో ఏకంగా బావపైనే ఆసిడ్‌తో దాడి చేసింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం రేపింది.
Read also: Tadipatri Crime: తాడిపత్రిలో దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు నిప్పంటించాడు
ఐదు రోజుల క్రితం నిర్మల్ జిల్లాలో ముధోల్ మండలం తరోడ గ్రామంలో దాబాపై నిద్రిస్తున్న మోహన్ అనే వ్యక్తి పై యాసిడ్ తో దాడి చేసిన ఘటన తెలిసిందే. పలు అనుమానితులపై మోహన్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మోహన్ పై మరదలు కల్పన యాసిడ్ తో దాడి చేసిందని పోలీసులు తేల్చారు. మరదలి కుటుంబంలో గొడవలకు బావ కారణం అవుతున్నాడని దాడి చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు. నిందితురాలు కల్పనను అరెస్టు చేసినట్లు పోలీసుల తెలిపారు. సీసీ పుటేజిలో మరదలు వెళ్తున్నట్టు గా ఉందంటున్న పోలీసులు గుర్తించామని అన్నారు. బాత్ రూమ్ లో వాడే యాసిడ్ పోసినట్టు గుర్తించారు. ముందుగా బాటిల్ లో తీసుకెళ్లి ఆ తరవాత గంజులో పోసి మీద పోసిందని పోలీసులు నిర్దారించారు. మోహన్ కుటుంబ సభ్యులు ఇంకా అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. మోహన్ సోదరుడిపై అనుమానం ఉందని అతన్ని కూడా విచారించాలని డిమాండ్ చేసున్నారు.
RBI : కనిపించకుండా పోయిన రూ.88,000 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు.. స్పందించిన ఆర్‌బీఐ