జల్లికట్టు (Jallikattu) తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట .ఇది స్పెయిన్లో జరిగే ఆటకు దగ్గరగా ఉన్నా దీని విధానం వేరుగా ఉంటుంది. జల్లికట్టులో ఎద్దులను చంపరు. మచ్చిక చేసుకోవాలనుకొనేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. తమిళనాడులోని గ్రామాలలో సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ నాడు దీనిని నిర్వహిస్తారు. అయితే.. తాజాగా మధురై జిల్లాలోని పలమేడులో జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకే పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎద్దుల కొమ్ములను వంచేందుకు యువత కుస్తీ పడుతున్నారు. ఈ పోటీలను చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు.
Also Read : Minister KTR : నేటి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు.. సిద్ధమైన తెలంగాణ పెవిలియన్
పోటీలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అయితే.. ఇక మొదటి రోజు మధురైలోని అవనియపురంలో జల్లికట్టు పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. పోటీల్లో వందలాది మంది యువకులు పాల్గొన్నారు. నిన్న జల్లికట్టు పోటీల్లో 60 మందికి గాయాలు అయ్యాయి. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న అవనియపురంలో జల్లికట్టు ఫైనల్స్ కోసం 1500 మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. 40 ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. ఎద్దులను లొంగదీసిన యువకులకు బహుమానాలు అందజేశారు.
Also Read : Minister KTR : నేను కూడా ఒక ప్రవాస భారతీయుడినే