దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయో, ఎక్కువ మంది ఇష్టపడే ఆహారం బిర్యానీ. ఎన్ని బిర్యానీ రెస్టారెంట్లు వచ్చినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. నోరూరించే బిర్యానీ తక్కువ ధరకు అందిస్తే ఇంకెందుకు ఊరుకుంటారు చెప్పండి. అమాంతం లాగించేస్తారు. సాధారణంగా బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా తక్కువ ఆఫర్లు పెడుతుంటారు. ఇలానే తమిళనాడులోని మధురైకి చెందిన ఓ వ్యాపారి బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రారంభం రోజున వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐదు పైసలకే బిర్యానీ అని ప్రకటించాడు. పాతకాలం నాటి పైసలు, పైగా…