ఘర్ వాపసీ మొదలు పెట్టాం.. రెండు రోజులుగా జరుగుతుంది ఇదే అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా మంది నాయకులు వెనక్కి వస్తున్నారని, సంబాని చంద్రశేఖర్.. లాంటి వాళ్ళు కూడా వెనక్కి వచ్చారన ఆయన తెలిపారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటామని ఆయన వెల్లడించారు. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలాని పార్టీ సూచించిందని, నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు వచ్చి చేరుతా అన్నా..చేర్చుకుంటామన్నారు జగ్గారెడ్డి. ఏఐసీసీ నిర్ణయాల మేరకే నడుచుకుందాం.. మనకు పదవులు సోనియాగాంధీ.. రాహుల్ కష్టమేనని, కాబట్టి వాళ్ళ నిర్ణయం పాటించాల్సిందేనన్నారు జగ్గారెడ్డి. రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తులను క్షమించిన గుణం సోనియాగాంధీ, రాహుల్.. ప్రియాంకదని, మనం వాళ్ళ నీడలో రాజకీయంగా బతుకుతున్నామన్నారు జగ్గారెడ్డి.
క్షమించే తత్వం ఉన్న కుటుంబం వాళ్ళదని, నా దగ్గర నాక్కూడా వ్యతిరేకంగా ఐదారుగురు పని చేశారు.. సస్పెండ్ చేశారన్నారు జగ్గారెడ్డి. మళ్ళీ వస్థానంటే రమ్మని చెప్పినమని, సంగారెడ్డి ఎమ్మెల్యే చేరుతా అంటే నీ అభిప్రాయం ఏంటని దామోదర రాజనర్సింహ అడిగారని, వాళ్ళు ఎవరైనా అడిగితే జాయిన్ చేసుకోండి అని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ అడిగితే అనే ప్రశ్నకు కూడా ఇచ్చేయండి అని చెప్పినానని ఆయన తెలిపారు. అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్త అంటున్నాడు .. మైనార్టీలు జాగ్రత్తగా ఉండండని, బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందన్నారు జగ్గారెడ్డి.