చక్కటి కెరీర్ అప్షన్ ఎంపిక విద్యార్థి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కెరీర్‌లో భద్రత, స్థిరత్వంతో పాటు భవిష్యత్తులో డిమాండ్ ఉండే కోర్సులను ఎంచుకోవాలి. నేటి విద్యార్థులు ఇంటర్మీడియట్ కాగానే ఉన్నత విద్య కోసం ఏ కోర్సుల్లో చేరాలనే దానిపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు చర్చించుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్, ఇంజనీర్ కావాలని ఆశిస్తుంటారు. ఇటీవలికాలంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అసక్తి చూపుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం.. రాబోయే నాలుగు సంవత్సరాల్లో AI, కంప్యూటర్ సైన్స్, డిజిటల్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాలలో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయట. అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల వివరాలు తెలుసుకుందాం..
1. డేటా సైన్స్:
ప్రస్తుతం డేటా సైన్స్ ఉద్యోగాలకు చాలా డిమాండ్ ఉంది. ఈ కోర్సులో కంప్యూటర్లు, వ్యాపారంతో పాటు, ఏఐ విధానాన్ని కూడా బోధిస్తారు. అంతే కాకుండా.. గణాంకాలు, బిగ్ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ గురించి సమాచారం అందిస్తారు. ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే.. రూ. 6 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తుంది.
2. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ –
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కోర్సు పూర్తి చేస్తే, ఇంట్లో కూర్చొని లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఈ కోర్సులో మీకు డెవలప్‌మెంట్, డిజైనింగ్, డిప్లాయ్‌మెంట్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ గురించి బోధిస్తారు.
3. సైబర్ సెక్యూరిటీ:
నేటి సమాజంలో సైబర్ దాడులకు సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీని కారణంగా సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఈ కోర్సు పూర్తి చేస్తే.. రూ. 6-12 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ పొందవచ్చు.
4. డేటా విశ్లేషణ –
కంపెనీలు తమ డేటాను అర్థం చేసుకుంటూ.. ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ.. వ్యాపార వృద్ధిని, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తున్నాయి. అందుకే డేటా విశ్లేషణకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది.
5. క్లౌడ్ కంప్యూటింగ్:
క్లౌడ్ కంప్యూటింగ్ ఉద్యోగాలకు చాలా డిమాండ్ ఉంది. దీని సహాయంతో కంపెనీలు తమ సేవలను డిజిటల్‌గా మెరుగుపరుచుకుంటున్నాయి. ఈ కోర్సు పూర్త చేస్తే లక్షల్లో జీతాలు లభిస్తాయి.