బ్యాంకింగ్ సెక్టా్ర్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఐడీబీఐ బ్యాంక్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీచేయనున్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM), మేనేజర్ పోస్టులతో సహా వివిధ పోస్టులను భర్తీకానున్నాయి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి బీటెక్, డిగ్రీ, పీజీ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
Also Read:CSK Captains: ధోనీ టు రుతురాజ్.. సీఎస్‌కే కెప్టెన్స్ లిస్ట్ ఇదే! మూడుసార్లు మహీనే
అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 25 నుంచి 40 ఏళ్లు కలిగి ఉండాలి. ఈ పోస్టులకు అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్/ వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. లక్ష జీతం అందుకోవచ్చు. ఐడిబిఐ బ్యాంక్ (స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్) పోస్టుకు దరఖాస్తు ఫీజు రూ.1050 చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు జీఎస్టీతో సహా రూ. 250 ఫీజు చెల్లించాలి. ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో ఏప్రిల్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.