Kothakota Srinivas Reddy appointed as Hyderabad CP: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐపీఎస్ బదిలీలకు మొదటిసారి శ్రీకారం చుట్టుంది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీలు మంగళవారం జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ (సీపీ)గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాచకొండ సీపీగా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్‌గా నియమించింది. మరోవైపు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం (ఈసీ) సీవీ ఆనంద్‌పై బదిలీ వేటు వేసిన తర్వాత హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యా నియమితులయిన విషయం తెలిసిందే.
Also Read:
Gas Cylinder: రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను 100 రోజుల్లో అమలుచేస్తాం: ఉత్తమ్
సీవీ ఆనంద్‌పై బదిలీ వేటు వేసిన తర్వాత హైదరాబాద్ సీపీ రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపించాయి. సందీప్ శాండిల్యతో పాటు సంజయ్‌కుమార్ జైన్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్లు వినిపించాయి. వీరిలో శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తారని అందరూ భావించారు. అయితే ఈసీ ఆదేశాల మేరకు హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సీపీగా బాధ్యతలు చేపట్టారు.