IPL 2026: IPL 2026 సీజన్ రిటెన్షన్ డెడ్‌లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో చివరి మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ట్రేడ్ మార్కెట్‌లో తొలి అడుగు వేసింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో చర్చలు పూర్తిచేసుకున్న ముంబై.. శార్దూల్ ఠాకూర్‌ను తమ జట్టులోకి అధికారికంగా తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శార్దూల్ ఇప్పుడు ఐపీఎల్ 2026 నుంచి తన “హోం సిటీ” జట్టుకే ఆడబోతున్నాడు. IPL 2025 వేలంలో అమ్ముడుకాకపోయిన తరువాత ఆయనను LSG రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా తీసుకుంది. పేస్ బౌలర్‌గా పాటు, అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లో కూడా ఉపయోగపడే ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన శార్దూల్ ఠాకూర్.. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్ వంటి స్టార్ బౌలర్లకు బ్యాకప్‌గా ఉంటారని అంచనా వేసినట్లు ఉంది ఎంఐ. ఈ విషయాన్నీ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో శార్దూల్ చేరికను ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. అందులో ఆయన “శార్దూల్ ఠాకూర్ ఆరా రే!” అంటూ ఫోన్‌లో మాట్లాడుతున్న సన్నివేశం కనిపిస్తుంది.
BSNL VoWi Fi: మహిళలు, విద్యార్థుల కోసం రూపొందించిన.. VoWi-Fi సేవను త్వరలో ప్రారంభించనున్న BSNL
ఇక శార్దూల్‌ను తీసుకోవడం కోసం ముంబై ఎవరిని విడిచిపెట్టిందో అధికారికంగా వెల్లడించకపోయినా.. తాజా సమాచారం ప్రకారం అర్జున్ టెండూల్కర్ ను LSGకి పంపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో కీలక ట్రేడ్‌లో వెస్టిండీస్ బ్యాటర్ షెర్ఫేన్ రుదర్‌ఫోర్డ్‌ను ముంబై తమ జట్టులో చేర్చుకుంది. గతంలో MI తరఫున ఆడిన ఆయన, గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున 291 రన్స్‌ను 157 స్ట్రైక్‌రేట్‌తో సాధించాడు. ఈసారి ఆయనను రైన్ రికెల్టన్, విల్ జాక్స్‌లతో కలిసి ఓవర్సీస్ బ్యాటింగ్ బ్యాకప్‌గా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
ముంబై ఇండియన్స్ ఇంతేకాకుండా.. ట్రేడ్ మార్కెట్‌లో ఇంకా చురుకుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా స్పిన్ విభాగాన్ని బలపరచడానికి వారు మయాంక్ మార్కండే లేదా రాహుల్ చహర్ ను తిరిగి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత సీజన్‌లో మయాంక్ మార్కండే KKR, రాహుల్ చహర్ SRH జట్లలో తగిన అవకాశాలు పొందలేకపోయారు. ముంబై మాత్రమే కాదు.. ఇతర జట్లు కూడా రిటెన్షన్ ముందు కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. CSK, RR జట్ల మధ్య పెద్ద ట్రేడ్ చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం సంజు సాంసన్ CSKలో చేరి, రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చేరే అవకాశం ఉంది. అలాగే పేస్ బౌలింగ్ విభాగంలో కూడా పెద్ద మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మహమ్మద్ షమీ కోసం లక్నో జట్టు పరిశీలిస్తుండగా, డిల్లీ క్యాపిటల్స్ కూడా షమీని తిరిగి తీసుకురావాలనే ఆసక్తి చూపుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
𝐓𝐑𝐀𝐃𝐄 ⬅ 𝐈𝐍
📲 𝐋𝐎𝐑𝐃 𝐓𝐇𝐀𝐊𝐔𝐑 incoming 😍💙 pic.twitter.com/TsoFQvCqkS
— Mumbai Indians (@mipaltan) November 13, 2025
𝐓𝐑𝐀𝐃𝐄 ⬅️ 𝐈𝐍
Get ready for ℝ𝕌𝕋ℍ𝔼ℝ𝔽𝕆ℝ𝔻 ची तोडफोड. Glad to have you 🔙 in the Blue & Gold, Sherfane! 💙💥 pic.twitter.com/DZHMQqO2TO
— Mumbai Indians (@mipaltan) November 13, 2025