కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో నిందితుడు ఎక్కడ ఎక్కాడో వివరాలు సేకరిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో ఎక్కినట్లు అనుమానిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమరాల్లో నిందితుడు కనిపించలేదు.