కేజీఎఫ్ సిరీస్‌తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. 2016 అందాల పోటీల్లో గెలిచిన శ్రీనిధి మోడల్ నుండి నటిగా మారింది. కేజీఎఫ్ వన్ అండ్ 2 హిట్స్ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక మేడమ్ రేంజ్ వేరే లెవల్ అనుకుంటే విక్రమ్ తో చేసిన కోబ్రా డిజాస్టర్ కావడంతో కొత్త ప్రాజెక్టులు రావడానికి పెద్ద టైమే పట్టింది. ఈ సారి టాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ వేసింది. సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదాలో నటించే అవకాశాన్ని కొల్లగొట్టింది ఈ శాండిల్ వుడ్ చిన్నది. అలాగే వెంటనే న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న హిట్ – 3లో యాక్ట్ చేసే ఛాన్స్ వరించింది. రీసెంట్లీ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. మే 1న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Bollywood : బాలీవుడ్ స్టార్స్.. బాక్సాఫీస్ వార్
సపోర్టింగ్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన నటుడు సుహాస్. బొమ్మ బొమ్మకు వేరియషన్ చూపించే సుహాస్ అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకటి ‘ఓ భామ, అయ్యో రామ’. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి స్టెప్ ఇన్ అవుతుంది మాలీవుడ్ సోయగం మాళవిక మనోజ్. ప్రకాశన్ పరాకట్టే సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తమిళ్ ‘జో’తో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. తెలుగు డబ్బింగ్ వర్షన్‌తో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైంది. రీసెంట్లీ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఓ భామ, అయ్యో భామ’ కూడా సమ్మర్‌లో విడుదల చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు. సమ్మర్ సీజన్ మరింత హాట్ చేసేందుకు అటు శాండిల్ వుడ్, ఇటు మాలీవుడ్ నుండి టాలీవుడ్‌పైకి వచ్చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు.