International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
International flights cancelled: విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. విజయవాడ, విశాఖపట్నం, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్ సహా తదితర విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళ్లే విమాన సర్వీసులు అకస్మాత్తుగా రద్దవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణానికి నాలుగు నుంచి ఐదు రోజుల ముందే విమానాల రద్దు సమాచారం అందుతుండటంతో ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లలో దాదాపు 95 శాతం వరకు క్యాన్సిలేషన్ మెసేజ్‌లు వస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తున్నప్పటికీ, ముందుగానే వేసుకున్న ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా అస్తవ్యస్తమవుతున్నాయి.
ఇక కొత్తగా టికెట్లు బుక్ చేయాలంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో రూ.70 వేల వరకు ఉన్న టికెట్ ధరలు ఇప్పుడు వన్‌వే ప్రయాణానికే రూ.2 లక్షల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిన ధరలను చూసి చాలామంది కుటుంబాలు తమ విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా విజయవాడ–షార్జా విమాన సర్వీసు రద్దవడంతో గల్ఫ్ కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. షార్జా మార్గంగా అమెరికా, యూరప్ వెళ్లాలని భావించిన వారి ప్రణాళికలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి కూడా ఇదే తరహా పరిస్థితులు నెలకొనడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు.
Also Read
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
- NIMS : నిమ్స్‌లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
ఈ పరిస్థితికి పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలే ప్రధాన కారణమని విమానయాన వర్గాలు చెబుతున్నాయి. ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో పాత టికెట్ ధరలకే సర్వీసులు నడపడం సంస్థలకు భారంగా మారిందని సమాచారం. నష్టాలు తగ్గించుకునేందుకు ఎయిర్‌లైన్స్ కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వేసవి సెలవులు, కుటుంబ కార్యక్రమాలు, విదేశాల్లో ఉన్న పిల్లల వద్దకు వెళ్లాలనుకున్నవారికి ఈ పరిణామాలు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నా కూడా భరోసా లేకపోవడంతో వందలాది కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. విమానం ఎక్కకముందే ప్రయాణికులకు భారీ ఝలక్ తగిలిన పరిస్థితి కనిపిస్తోంది.
తాజావార్తలు
-
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
-
Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్‌లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..