Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
- మెహదీపట్నంలో భారీ డ్రగ్స్ గ్యాంగ్ గుట్టురట్టు
- రాపిడో, జొమాటో డెలివరీ బాయ్స్ పేరుతో మత్తు దందా
- రూ.26.80 లక్షల ఎండీఎంఏ స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్
- బాలానగర్ కేంద్రంగా సాగిన డ్రగ్స్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులకు మరో భారీ విజయం లభించింది. మెహదీపట్నం పరిధిలో గోల్కొండ టాస్క్‌ఫోర్స్ , స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో భారీగా ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్, ముగ్గురు సబ్ పెడ్లర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురు వినియోగదారులను పోలీసులు రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి దాదాపు రూ. 26.80 లక్షల విలువైన 137.60 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, ఒక విలాసవంతమైన వోల్వో XC90 కారు, 9 మొబైల్ ఫోన్లు, ప్యాకింగ్ మెటీరియల్ , ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ముఠా డ్రగ్స్ సరఫరా కోసం అనుసరిస్తున్న విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బాలానగర్ కేంద్రంగా నెట్వర్క్ నడుపుతూ, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రాపిడో , జొమాటో డెలివరీ బాయ్స్ పేరుతో ఈ డ్రగ్స్ దందాను సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఒక గ్రాము ఎండీఎంఏను రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు విక్రయిస్తున్నట్లు తేలింది. కాగా, ఈ ముఠా ప్రధాన నిందితుడికి గతంలో చిలకలగూడ డ్రగ్స్ కేసులో అరెస్టైన సాయి నిఖిల్‌తో బలమైన సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. పట్టుబడిన నిందితులందరిపై ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఉన్న మరికొందరి ఆచూకీ కోసం విచారణను మరింత వేగవంతం చేశారు.
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!