Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor Police: చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన నకిలీ నోట్ల మోసం కేసులో పోలీసుల పాత్ర బయటపడింది. గంగధర నెల్లూరు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఖాకీలే దొంగలుగా మారి వ్యాపారులను మోసం చేసిన విషయం వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడుకు చెందిన కొందరు వ్యాపారులను నిందితులు నమ్మించి గంగధర నెల్లూరుకు పిలిపించారు. రూ.10 లక్షల అసలు నోట్లకు బదులుగా రూ.1 కోటి నకిలీ నోట్లు ఇస్తామని ఆశ చూపించి వారిని ఉచ్చులోకి దించారు. అనంతరం బెదిరింపులకు పాల్పడి వారి వద్ద ఉన్న రూ.10 లక్షలను దోచుకున్నట్లు వెల్లడైంది.
ఈ దోపిడీ ముఠాలో లోకనాథం అనే ట్రాఫిక్ ఏఎస్సైతో పాటు రవి అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. వీరితో పాటు మరికొందరు సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాట్టుకండిగ గ్రామం వద్ద నిందితులను గంగాధర నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మొదట కొబ్బరికాయల వ్యాపారం పేరుతో వచ్చి తమను దోచుకున్నారని బాధితులు కథనం చెప్పినప్పటికీ, లోతుగా విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. విచారణలో నకిలీ నోట్ల మార్పిడి దందా నేపథ్యంలోనే ఈ దోపిడీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఖాకీలే నేరంలో పాల్గొనడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!