Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
- రైలు కింద పిల్లలను కాపాడిన తల్లి
- సమష్టిపూర్ స్టేషన్లో ఉత్కంఠ ఘటన
- వైరల్ వీడియోపై నెటిజన్ల ప్రశంసలు
- ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడంపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Saves Children Under Moving Train in Bihar Viral Video : అమ్మ అంటే ప్రేమ మాత్రమే కాదు.. అవసరమైతే మృత్యువుతో పోరాడే ధైర్యం కూడా అని ఒక ఘటన నిరూపించింది. తన కళ్లెదుటే మృత్యువు రైలు రూపంలో దూసుకొస్తున్నా, ఏమాత్రం భయపడకుండా తన బిడ్డలను గుండెలకు హత్తుకుని ప్రాణాలతో బయటపడింది ఒక వీరమాత. ఒళ్లు గగుర్పొడిచే ఈ హృదయ విదారక ఘటన బిహార్‌లోని సమష్టిపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
సమష్టిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషన్లో ముగ్గురు మహిళలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతున్నారు. సరిగ్గా అదే సమయంలో అత్యంత వేగంతో ఒక రైలు ఆ ట్రాక్ మీదికి దూసుకొచ్చింది. ప్లాట్‌ఫారమ్ ఎక్కేలోపే రైలు దగ్గరకు వచ్చేయడంతో ఏం చేయాలో పాలుపోని ఆ మహిళలు, ప్లాట్‌ఫారమ్‌కు , ట్రాక్ పక్కన ఉన్న ఇరుకైన గ్యాప్‌లో దూరిపోయారు.
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
రైలు వేగంగా వెళ్తున్నా, ఆ కంపనలకు బిడ్డలు భయపడి బయటకు రాకుండా ఒక తల్లి వారిద్దరినీ తన గుండెలకు హత్తుకుని పడుకుంది. రైలు పెట్టెలన్నీ వెళ్లే వరకు ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడుకుంది. చూస్తున్న వారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. రైలు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో సహా అందరూ సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ తల్లి ధైర్యసాహసాలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అదే సమయంలో రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్ దాటేందుకు వంతెన (Foot Over Bridge) సదుపాయం లేకపోవడంతోనే ప్రయాణికులు ఇలా ప్రాణాలను హస్తగతం చేసుకుని ట్రాక్‌లు దాటాల్సి వస్తుందని వారు మండిపడుతున్నారు.
మృత్యువు ముంగిట నిలబడి కూడా తన బిడ్డలను కాపాడుకున్న ఆ తల్లి సాహసం చూసి “అమ్మ కంటే గొప్ప యోధులు ఎవరూ ఉండరు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, రైల్వే ట్రాక్‌లు దాటేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
SHOCKING VISUALS 🚨
A mother in Bihar risked her own life to save her two children after a train suddenly arrived while they were crossing the tracks near Shahpur Patori railway station.
According to reports, the three women quickly sat down with the children pressed beneath… pic.twitter.com/JCEdu5R9Y3
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 15, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు