Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
- గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం
- కేకేఆర్ విజయంపై రహానే సంతోషం
- జట్టు సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌పై కీలక విజయం సాధించిన అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. పట్టికలో రెండు పాయింట్స్ చేరడం ఆనందంగా ఉందని చెప్పాడు. తాము ప్రతి మ్యాచ్‌ను ఒక్కో దశగా తీసుకుంటున్నామని పేర్కొన్నాడు. జట్టు సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధ్యమైందని రహానే స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 29 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
మ్యాచ్ అనంతరం అజింక్య రహానే మాట్లాడుతూ…’ఇది చాలా మంచి మ్యాచ్. రెండు పాయింట్లు రావడం చాలా ఆనందంగా ఉంది. మైదానంలో చాలా వేడిగా ఉండటంతో ఆటగాళ్లు అలసిపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసి 247 పరుగులు చేయడం గొప్ప విషయం. ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ, కామెరాన్ గ్రీన్ అద్భుతంగా ఆడారు. వారి ఉద్దేశం, ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉన్నాయి. నాణ్యమైన బౌలర్లపై వారు ఒత్తిడి తెచ్చారు. బ్యాటర్లు తమ బలాలపై నమ్మకం ఉంచి ఆడారు’ అని అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
కేకేఆర్ జట్టు సన్నద్ధత గురించి అజింక్య రహానే మాట్లాడుతూ… ‘మేము ప్రతి మ్యాచ్‌ను ఒక్కో దశగా తీసుకుంటున్నాం. క్రికెట్‌ను సింపుల్‌గా ఉంచితేనే మంచి ఫలితాలు వస్తాయి. మా ఆటగాళ్లు దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించారు. అదే ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఐపీఎల్లో కనిపిస్తోంది’ అని చెప్పాడు. కొత్త బౌలర్ సౌరభ్ దుబే ప్రదర్శనపై కూడా జింక్స్ ప్రశంసలు కురిపించాడు. ‘సౌరభ్ దూబే విదర్భ లీగ్‌లో బాగా ఆడాడు. అతడిలో మంచి టాలెంట్ ఉంది. కోచింగ్ సిబ్బంది కూడా నమ్మకం ఉంచారు. దూబే కష్టపడి పడుతున్నాడు. అతడికి మంచి భవిష్యత్ ఉంది’ అని తెలిపాడు.
సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి గురించి కూడా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వరుణ్ గాయంతో ఇబ్బంది పడుతున్నా మ్యాచ్ ఆడాడు. నా జట్టులో సునీల్ నరైన్, వరుణ్ లాంటి బౌలర్లు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు బంతి ఇచ్చినా వారు వికెట్స్ తీస్తారు. ఈ విజయంతో కేకేఆర్ జట్టులో కొత్త ఉత్సాహం నిండింది. జట్టు సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధ్యమైంది. ఇక తదుపరి మ్యాచుపై దృష్టి పెట్టాలి’ అని రహానే తెలిపాడు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!