Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- పోక్సో కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్
- పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భగీరథ్
- లాయర్ల సమక్షంలో లొంగిపోయిన బండి భగీరథ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో పరారీలో ఉన్న నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు సమాచారం. ఈ కేసులో హైకోర్టు నుండి ఆయనకు మధ్యంతర బెయిల్ రాకపోవడంతో పాటు, సైబరాబాద్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో ముమ్మరంగా గాలిస్తుండటంతో అరెస్ట్ తప్పదని భావించిన భగీరథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బాధితురాలు ఇచ్చిన రెండవ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఇప్పటికే మొయినాబాద్ ఫామ్‌హౌస్, నానక్‌రామ్‌గూడలోని సర్వీస్ అపార్ట్మెంట్లలో క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేశారు. భగీరథ్ లొంగిపోవడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రాథమిక ప్రక్రియలను ముగించి, తదుపరి విచారణ నిమిత్తం కేసును విచారిస్తున్న అధికారులకు అప్పగించనున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
- Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
-
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!