Indian Airlines: పహల్గామ్ ఉగ్ర దాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం కూడా ఇప్పటికే దౌత్య చర్యల్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు, పాకిస్థానీలకు వీసాల రద్దు, సరిహద్దు మూసివేత వంటి నిర్ణయాలను ప్రకటించింది. అయితే, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత్‌తో వాణిజ్యం రద్దు చేయడంతో పాటు అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేసినట్లు ప్రకటించింది.…
Flight Bomb Threats: గత కొన్ని రోజులుగా భారతదేశ విమానయాన రంగం తీవ్ర బెదిరింపుల్ని ఎదుర్కొంటోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ, విస్తారా ఇలా అన్ని సంస్థలకు చెందిన విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. గత వారం నుంచి ఏకంగా 100కు పైగా విమానాలు బెదిరింపులు ఎదుర్కోన్నాయి. వీటిలో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి.అయితే, వీటిలో చాలా వరకు బెదిరింపులు ఎక్స్(ట్విట్టర్) ఖాతాల నుంచి వచ్చినవే.
Bomb threats: వరసగా బాంబు నకిలీ బాంబు బెదిరింపులు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వారం ప్రారంభం నుంచి 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఈ రోజు మరో 6 ఇండిగో విమానాలు కూడా ఇదే తరహా బెదిరింపుల్ని ఎదుర్కొన్నాయి.
Hoax Bomb Threats: వరసగా నకిలీ బాంబు బెదిరింపులు ఇండియా విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. భారత విమానయాన రంగాన్ని నష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే ఈ నకలీ బెదిరింపుల వల్ల ఏయిర్‌లైన్ సంస్థలు కోట్లలో నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొన్ని బెదిరింపులు లండర్, జర్మనీ నుంచి వచ్చాయని తెలుస్తోంది. కావాలనే భారత విమానాలను టార్గెట్ చేస్తు్న్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Plane Hijackings: నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘‘IC 814: ది కాందహార్ హైజాక్’’ వల్ల ఇప్పుడున్న తరానికి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 1999లో హైజాక్ ఘటన గురించి తెలుస్తోంది. దీనిపై వచ్చిన వివాదాల సంగతి ఎలా ఉన్నా, అప్పుడు జరిగిన పరిణామాల గురించి తెలుసుకోగలిగారు. అయితే, భారతదేశంలో ఇప్పటి వరకు 16 సార్లు విమానాల హైజాక్ జరిగింది. అయితే, ఆ కాలంలో దేశంలో ఉన్న ఒకే ఒక్క ఎయిర్ లైన్ సంస్థ ‘‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’’ ఈ హైజాకింగ్ ఘటనల్ని…
Boeing 737 MAX: బోయింగ్ 737 మ్యాక్స్ ప్యాసింజర్ విమానంలో లూజ్ బోల్ట్ హెచ్చరికలతో భద్రతా తనిఖీలు నిర్వహించాలని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) భావిస్తోంది. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఈ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాన్ని తనిఖీ చేస్తున్న క్రమంలో రడ్డర్ కంట్రోల్ లింకేజ్ మెకానిజంలో నట్ లేకుండా బోల్ట్ ఉండటాన్ని గమనించారు. దీని తర్వాత రడ్డర్ నియంత్రణ వ్యవస్థను నిశితంగా పర్యవేక్షించనున్నారు.
ప్రముఖ విమాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ చరిత్ర సృష్టించింది. ఒక్క ఏడాదిలో వంద మిలియన్ (పది కోట్ల మంది) ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు సాధించింది. ఈ మేరకు ఇండిగో ఎక్స్లో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.. ‘ఒక ఏడాది(2023) క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన తొలి భారతీయ విమానయాన సంస్థగా అరుదైన ఘనత సృష్టించింది’ అని పేర్కొంది. Also Read: Mumbai:…
Aviation Industry: కరోనా వైరస్ మహమ్మారి ఆంక్షల తర్వాత, మరోసారి భారత విమానయాన రంగం గందరగోళాన్ని చూస్తోంది. ఈ రంగంలో ఉత్సాహం కరువైంది. ఎందుకంటే ఇప్పుడు గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాలా తీసిందని ప్రకటించి విమానాలను నిలిపివేసింది.
Bonza Airline: తక్కువ ధరలో విమాన ప్రయాణికులకు సేవలందించేందుకు ఆస్ట్రేలియాలో కొత్త ఎయిర్ లైన్స్ సంస్థ అందుబాటులోకి రానుంది.దేశీయ విమానయాన సంస్థ బొంజా ఎయిర్లైన్ కు ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆమోదం లభించింది.