CM Revanth Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర రాజకీయాలు వంటి ఇతరత్రా అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం ఢిల్లీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి సాయంత్రానికే హైదరాబాద్ రానున్నారు. ఇక అధిష్టానంతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ కలవనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం సీఎం ప్రధాని అపాయింట్‌మెంట్ కోరినట్టు సమాచారం. ప్రధాని అపాయింట్‌మెంట్ లభిస్తే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
Also Read: CM Revanth Reddy: వెయ్యి ఎకరాల కోసం వేట.. ఔటర్ చుట్టు భూములు గుర్తించాలని ఆదేశం
కాగా మంత్రివర్గ కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ భేటీలో సీఎం హోం, విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలపై అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. అలాగే నామినేటెడ్ పదవులు గురించి కూడా అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పదవుల పంపిణీ జరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు రేపు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానిని కలిసేందుకు సీఎం భావించినట్టు తెలుస్తోంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Kerala: అమానవీయ ఘటన.. వృద్ధురాలైన అత్తను దారుణంగా కొట్టిన కోడలు, వీడియో వైరల్