Urvashi Rautela Injured in NBK 109 Sets: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తో వరుస అవకాశాలు అందుకుంది. వెంటనే ఏజెంట్ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పవన్ – తేజ్ కాంబోలో వస్తున్న బ్రో సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. ఇప్పటికే సాంగ్ షూట్ ను కూడా పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ బాలయ్య సినిమాలో నటిస్తూ బిజీగా మారింది. వాల్తేరు వీరయ్య తరువాత డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం NBK109. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల మీద నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్యకు ధీటుగా బాబీ డియోల్ నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Krishna Vamsi: నన్ను చూసి ఆఫీస్ బాయ్ అనుకున్నారు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక ఈసారి ఐటెంసాంగ్ కోసం కాకుండా ఒక కీలక పాత్ర కోసం బాబీ.. ఊర్వశీని దింపాడు బాబీ. అయితే, షూటింగ్‌లో ఊర్వశి తీవ్రంగా గాయపడిందని, వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. ఓ సీన్ షూట్ చేసున్న సమయంలో ఊర్వశికి ఫ్రాక్చర్ అయ్యిందని.. అప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె టీమ్ తెలిపింది. ఎన్‌బీకే 109 మూవీ మూడో షెడ్యూల్ కోసం ఊర్వశి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఊర్వశి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. ఈ మూవీలో ఊర్వశి రౌతేలాతో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఊర్వశి ప్రస్తుతం బాలకృష్ణ మూవీతో పాటు సన్నీ డియోల్ ‘బాప్’.. మిథున్ చక్రవర్తి, సంజయ్‌దత్, రణదీఫ్ హుడాతో ‘ఇన్‌స్పెక్టర్ అవినాశ్-2’ చిత్రాల్లో నటిస్తున్నది.