Pa Ranjith: తమిళనాడు మాయావతికి చెందని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర చీఫ్‌గా ఉన్న ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణహత్య రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ప్రతిపక్షాల నుంచి అధికార డీఎంకే సర్కార్ విమర్శలు ఎదుర్కొంటోంది. స్టాలిన్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శిస్తున్నాయి. ప్రముఖ తమిళ డైరెక్టర్ పా రంజిత్ కూడా డీఎంకే ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర విమర్శలు చేశారు.
పా రంజిత్, ఆర్మ్‌స్ట్రాంగ్ చాలా మంది మిత్రులు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ని సోదరుడిగా భావించే వాడు. ఇద్దరూ అంబేర్కరైట్ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు. ‘‘ఆర్మ్ స్ట్రాంగ్ హత్య సెంబియం పోలీస్ స్టేషన్‌కి అతి సమీపంలో జరిగింది. దీన్ని బట్టి తమిళనాడులో శాంతిభద్రతలపై హంతకులకు ఎంత భయం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. శాంతిభద్రతలు పునరుద్ధరించడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ’’ అని ఎక్స్ వేదికగా పా రంజిత్ ప్రశ్నించారు.
ఆర్మ్‌స్ట్రాంగ్‌ని కోల్పోవడం తన జీవితంలో అతిపెద్ద ఎదురుదెబ్బగా అతను వర్ణించాడు. పెరంబూర్‌లోని ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతికకాయాన్ని అతని ఆఫీసులో పూడ్చిపెట్టడం ఉద్దేశపూర్వకంగా నిరోధించబడందని ఆరోపించారు. రెండు రోజుల డ్రామా ముగిసిన తర్వాత చెన్నైకి శివార్లలో అతని మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి మాపై ఒత్తిడి తెచ్చారని పా రంజిత్ అన్నారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, అతను నివసించిన ప్రదేశంలో ఖననం చేయడానికి అనుమతించలేదని, మీరు నిజంగా దళిత నాయకులు, దళిత ప్రజల పక్షాన ఉన్నారా..? అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Krishna Vamsi: నన్ను చూసి ఆఫీస్ బాయ్ అనుకున్నారు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘దళితులకు దళితులు గణనీయంగా ఓటేయడమే డీఎంకే అధికారంలోకి రావడానికి ఒక కారణం. దళితులు మీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని మీకు తెలియదా? లేక ఈ విషయం తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలని నేనూ ఓటేశాను.. అందుకే నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నాను సామాజిక న్యాయం ఓట్ల కోసమేనా?’’ అని ప్రశ్నించారు. ఈ హత్యను ప్రతీకార హత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, మూసేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్కాట్ సురేష్ హత్యకు ప్రతీకారంగానే ఆర్మ్‌స్ట్రాంగ్‌ని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారని, అయితే, దీనికి ఎవరు ప్లాన్ చేశారు..?, ఈ హత్యకు ఆరుద్ర బంగారం కుంభకోణం కేసులో ఉందా..? అని అడిగారు.
‘‘ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కారణంగా తలెత్తిన శాంతిభద్రతల సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియక సోషల్ మీడియా మరియు మీడియాలో చాలా మంది అతన్ని రౌడీగా, పంచాయితీ చేసే వ్యక్తిగా, నేర నేపథ్యం ఉన్న వ్యక్తిగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఇదంతా వ్యాప్తి చేయడం వెనుక ఉన్నది ఎవరు..?’’ అని పా రంజిత్ అడిగారు. ఈ హత్యలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 52 ఏళ్ల ఆర్మ్ స్ట్రాంగ్‌ని చంపేందుకు గుర్తుతెలియని వ్యక్తులు పెరంబూర్ ప్రాంతంలోని అతని ఇంటి నివాసానికి ఫుడ్ డెలివరీ ఏజెంట్ల వేషంలో వచ్చి నరికి చంపారు.