సూపర్‌స్టార్ రజనీకాంత్ కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువనే సంగతి అందరికి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండటం కోసం ప్రతీ ఏదాడి హిమాలయాలను సందర్శిస్తారు.అక్కడ ధ్యానం చేసి..మానసిక ప్రశాంతత ను పొందుతారు. రజనీకాంత్.. ఆయన నటించిన సినిమాల విడుదల ఉంటే ఆ సినిమా హడావుడి నుండి కాస్త ఉపశమనం కోసం విడుదలకు ముందే హిమాలయాలకు వెళ్తారు. సినిమా విడుదల రోజు కచ్చితంగా ఆయన హిమాలయాల లో ఉండేట్లు చూసుకుంటారు.అయితే కరోనా మహమ్మారి వల్ల గత నాలుగు సంవత్సరాలు గా రజినీ హిమాలయాలకు దూరం గా ఉన్నారు. తాను నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 10 వ తేదీన గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
జైలర్ సినిమా విడుదల కు ఒకరోజు ముందుగానే హిమాలయాల యాత్ర కు బయలుదేరిన రజనీకాంత్ శనివారం బద్రీనాథుని సన్నిధికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. చార్‌ధామ్ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ లో బద్రీనాథీశ్వరుడి దర్శనం చేసుకున్నారు.అక్కడి కి వచ్చిన భక్తులు రజనీకాంత్ ను గుర్తు పట్టి ఆయన తో ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు.తరువాత ఆయన వారితో కాసేపు ముచ్చటించారు.అక్కడ దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం లో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది. జైలర్ సినిమా తో రజనీకాంత్ అదరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ ముత్తువేల్ పాండ్యన్ అనే రిటైర్డ్ పోలీస్ అధికారి పాత్ర లో కనిపించారు. జైలర్ సినిమా ఫస్ట్ 3 డేస్ లోనే దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రజని బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నిరూపించింది