అతని టెస్టు కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ. అయితే.. తొలి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందు ఆయుధ పూజ చేశాడు. తన బ్యాట్, గ్లౌజులను టేబుల్ పై ఉంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగడం గమనార్హం. దీంతో.. పంత్ పూజలు ఫలించాయని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మహిళల బిగ్ బాష్ లీగ్ 2023లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మహిళా బ్యాట్స్‌మెన్ గ్రేస్ హారిస్ విరిగిన బ్యాట్‌తో సిక్సర్ కొట్టింది. అది చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బాల్ బ్యాట్ కు తాకడంతో ఉన్నట్టుండి బ్యాట్ విరిగిపోయింది. అయినా కానీ బాల్ బౌండరీ దాటి సిక్స్ వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంగ్లండ్‌లో జరుగుతున్న వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో వింత ఘటన జరిగింది. గ్లౌసెస్టర్‌షైర్ మరియు సోమర్‌సెట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గ్లౌసెస్టర్‌షైర్ బ్యాట్స్‌మెన్ గ్రాంట్ రోలోఫ్‌సెన్ ఒక బంతిని రెండుసార్లు కొట్టాడు. కావాలని కాకుండా.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండుసార్లు బంతి బ్యాట్ కు తగిలింది. ఈ మ్యాచ్‌లో గ్రాంట్ అర్ధ సెంచరీ చేశాడు.