ICC Under 19 World Cup 2024: సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ 2024 (నిన్న) జనవరి 19 నుంచి ప్రారంభం అయింది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 11వ తేదీన జరుగుతుంది. టోర్నీలో నేడు టీమిండియా తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడబోతుంది. ఈ 50 ఓవర్ల టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా సత్తా చాటింది. ఇక, ఇప్పటి వరకు టీమిండియా అండర్-19 ప్రపంచకప్‌ను 5 సార్లు గెలుచుకుంది. ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. భారత యంగ్ టీమ్ ఇటీవల అండర్- 19 ట్రై-సిరీస్‌ను కూడా గెలుచుకుంది. అయితే, ఇవాళ టీమిండియా తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును ఢీకొట్టనుంది. నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
Read Also: Gold Price Today : షాకింగ్ న్యూస్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
ఇక, అండర్-19 ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ మధ్యాహ్నం 1:00 గంటలకు పడుతుంది. అయితే, ఈ మ్యాచ్ బ్లూమ్‌ఫోంటైన్‌లోని మంగాంగ్ ఓవల్‌లో జరగనుంది. అండర్-19 వరల్డ్ కప్ కు సంబంధించిన అన్ని మ్యాచ్ లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే, లైన్ స్ట్రీమింగ్ Disney+Hotstarలోనూ ప్రసారం అవుతుంది.
Read Also: Ayodhya : 500ఏళ్ల నిరీక్షణకు తెర.. నేడు అయోధ్య ప్రధాన ఆలయంలోకి రాములోరు
ఇరు జట్ల అంచనా:
టీమిండియా జట్టు అంచనా: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), అరవెల్లి అవ్నీష్ రావు (వికెట్ కీపర్), సౌమ్య కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇనేష్ మహాజన్ (వికెట్ కీపర్). ), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ తుది జట్టులో ఉన్నారు.
బంగ్లాదేశ్ జట్టు అంచనా: మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ (కెప్టెన్), ఆషికుర్ రహ్మాన్ షిబ్లీ, జీషాన్ ఆలం, చౌదరి మహ్మద్ రిజ్వాన్, ఆదిల్ బీన్ సిద్ధిక్, మహ్మద్ అష్రాఫుజ్జామాన్ బోరానో, ఆరిఫుల్ ఇస్లాం, షిహాబ్ జేమ్స్, అహ్రార్ అమీన్ (వైస్ కెప్టెన్), ఉజి రోబల్, షేక్, పర్త్వే బోర్సన్. హసన్ ఎమాన్, వాసి సిద్ధిఖీ, మరుఫ్ మృధా తుది జట్టులో ఉన్నారు.