భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తంగా సాగుతుంది. ఫోర్త్ టెస్టులో బ్యాంటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ లో రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ స్కోర్ 255/4తో బ్యాంటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా టీమ్ లో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 422 బంతుల్లో 180 పరుగులు (21 ఫోర్స్), కామెరూన్ గ్రీన్ 170 బంతుల్లో 114 పరుగులు( 18 ఫోర్లు ) సెంచరీలు నమోదు చేశారు.
Also Read : TV Rama Rao Resigns YSRCP: వైసీపీకి షాక్..! పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై..
దాంతో తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 167.2 ఓవర్లు ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేసింది. భారత్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టగా మహ్మద్ షమీ రెండు, రవీంద్ర జాడేజా, అక్షర్ పటేల్ తల ఒక వికెట్ తీశారు. గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్ లో మొదటిరోజే ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (32 ), కెప్టెన్ స్టీవ్ స్మిత్(38), మార్కస్ లబుషేన్(3), పీటర్ హ్యాండ్స్ కబ్(17) తక్కువ పరుగులకే ఔటైపోయారు. గురువారమే శాతకం బాధిన ఉస్మాన్ ఖవాజా శుక్రవారం కూడా 104 పరుగుల ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోర్ వద్ద బ్యాటింగ్ కొనసాగించి తొలి రెండు సెషన్ల పాటు వికెట్ ఇవ్వలేదు. దాంతో అతను డబుల్ సెంచరీ సాధించేలా కనిపించాడు. కానీ.. టీమ్ స్కోర్ 409 పరుగుల వద్ద అక్షర్ పటేల్ అతడ్ని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు.
Also Read : Kavitha: దీక్ష విరమించిన ఎమ్మెల్సీ కవిత.. రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం
కానీ, మరో వైపు 49 పరుగులతో ఈ రోజు బ్యాటింగ్ కొనసాగించిన కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడేసీ సెంచరీ తర్వాత ఔటైపోయాడు. అయితే ఈ జోడి ఐదో వికెట్ కి ఏకంగా 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కామెరూన్ గ్రీన్ ఔట్ తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీ(0), మిచల్ స్టార్క్(6) నాథన్ లయన్(34),టాడ్ మర్ఫీ(41) కూడా అశ్విన్ వరుస విరామాల్లో ఔట్ చేసేశాడు. చివర్లో కున్ మెన్(0) మాత్రం అజేయంగా క్రీజులో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో ఉమేశ్ యాదవ్ 25 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దానికి తోడు ఓవర్ కి సగటున 4కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు.. మహ్మద్ షమీ2 రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తలో వికెట్ సాధించారు. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 36 పరుగులు సాధిచింది.
Also Read : PAT CUMMINS : ప్యాట్ కమిన్స్ కు మాతృవియోగం.. నల్లబ్యాడ్జీలతో ఆసీస్ ప్లేయర్స్ సంతాపం