మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. ఎమ్మెల్సీ కవితకు సీపీఐ నారాయణ, బీఆర్ఎస్ ఎంపీ కేకే నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. మహిళల రిజర్వేషన్ బిల్లు ఓ చారిత్రక అవసరం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళల రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తోందని ఆమె ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తలుచుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందని చెప్పారు.
Also Read: PAT CUMMINS : ప్యాట్ కమిన్స్ కు మాతృవియోగం.. నల్లబ్యాడ్జీలతో ఆసీస్ ప్లేయర్స్ సంతాపం
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టి సారించాలని కోరారు. శంలోని అన్ని రాజకీయ పార్టీలు పోరాడాలని, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని కవిత అన్నారు. ఇందు కోసం రాష్ట్రపతికి లేఖ రాస్తామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు తాము పోరాడతామన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో దూసుకెళ్తారని చెప్పారు. తమ దీక్షకు మద్దతు తెలిపిన పలు రాజకీయ పార్టీల నేతలకు కవిత ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Karnataka: మరోసారి కర్ణాటకకు ప్రధాని మోదీ.. ఎన్నికల నేపథ్యంలో వరస పర్యటనలు
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రేపు ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై..తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించకోవడానికి ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈడీకి నోటీసులు పంపించింది. అయితే, రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఆధారంగానే ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది.