IND Playing 11 vs BAN: శార్దూల్, సిరాజ్ ఔట్.. బంగ్లాదేశ్‌తో బరిలోకి దిగే భారత్ తుది జట్టు ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing 11 vs BAN: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత్.. మరో సమరానికి సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 19) పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో రోహిత్ సేన తలపడనుంది. భారత్ మరో విజయంపై కన్నేయగా.. మెగా టోర్నీలో టీమిండియాకు మరోసారి షాక్ ఇవ్వాలని బంగ్లా చూస్తోంది. మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఓసారి చూద్దాం.
డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన శుభ్‌మాన్ గిల్.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. పాకిస్తాన్‌పై 16 పరుగులకే ఔట్ అయిన గిల్.. బంగ్లాదేశ్‌పై చెలరేగాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. వరుస హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఫామ్‌లోనే ఉన్నారు. ఇప్పటివరకు స్టార్ ఆల్‌రౌండర్‌లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. పాండ్యా ఆస్ట్రేలియాపై 11 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. జడేజా ఇంకా బ్యాటింగ్ చేయలేదు. జట్టును ఆదుకోవడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు.
Also Read
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
భారత్ బౌలింగ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. నాలుగు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడిన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌లలో ఒకరికి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్ను గాయంతో ఈ ఏడాది ఎక్కువగా మ్యాచ్‌లు ఆడని బుమ్రాను కొనసాగించి సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సిరాజ్ స్థానంలో సీనియర్ పేసర్ మొహ్మద్ షమీ జట్టులోకి వస్తాడు. ఇక ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఆడే అవకాశం ఉంది. మరో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు.
Also Read: NED vs SA: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం.. మూడేళ్ల క్రితం ట్వీట్ వైరల్!
భారత్ తుది జట్టు (అంచనా):
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!