NED vs SA: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం.. మూడేళ్ల క్రితం ట్వీట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netherlands Bowler Paul van Meekeren’s Uber Eat Tweet Goes Viral: వన్డే ప్రపంచకప్ 2023లో రెండో సంచలనం నమోదైన విషయం తెలిసిందే. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పసికూన అఫ్గానిస్తాన్ మట్టికరిపించగా.. తాజాగా పటిష్ట దక్షిణాఫ్రికాను మరో పసికూన నెదర్లాండ్స్ ఓడించింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆపై ప్రొటీస్ 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు విజయంలో పేసర్ పాల్ వాన్ మీకెరెన్ కీలక పాత్ర పోషించాడు. 9 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. దాంతో మీకెరెన్ మూడేళ్ల కిందట చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.
‘ఈ రోజు నేడు క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ చలికాలంలో ఉబెర్ ఈట్స్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేస్తున్నా. పరిస్థితులు ఎలా మారిపోయాయో? కదా. హహ్హహ్హ. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి’ అని పాల్ వాన్ మీకెరెన్ 2020లో పోస్టు పెట్టాడు. అది ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టీ20 ప్రపంచకప్ మరుసటి ఏడాదికి వాయిదా పడటంతో.. కుటుంబ పోషణ కోసం ఉబెర్ ఈట్స్ లో మీకెరెన్ ఫుడ్ డెలివరీ చేశాడు.
Also Read
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
Also Read: Scott Edwards: భారీ అంచనాలతో వచ్చాం.. మరిన్ని షాక్‌లు ఇస్తాం: నెదర్లాండ్స్ కెప్టెన్
గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తాను ఫుడ్ డెలివరీ చేసిన విషయం వాన్ మీకెరెన్ తెలిపాడు. ‘కరోనా సమయంలో క్రికెట్ ఆడేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. ఉద్యోగం చేయాలనుకున్నా. కుటంబ పోషణ (నిత్యావసరాలు, పెట్రోలు, ఆహారం, ఇంటి అద్దె, ఫోన్ బిల్లులు) కోసం పని చేయాలి. క్రికెట్ జట్టు నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు కాబట్టి దానికి అనుకూలంగా ఉండే జాబ్స్ కోసం ప్రయత్నించా. నా స్నేహితుల ద్వారా ఫుడ్ డెలివరీ ఉద్యోగం దక్కింది. ఈ పని చేయడానికి నేను సిగ్గు పడలేదు’ అని మీకెరన్ చెప్పాడు.
Huge Respect @paulvanmeekeren 🔥😍#ICCWC2023 #SAvNED #PaulVanMeekeren
VC: @SkySports pic.twitter.com/LySsjeTlyW
— Idam Porul (@IdamPorul) October 17, 2023
తాజావార్తలు
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!