ప్రపంచకప్ 2023లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ అన్నింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఉంది. లీగ్ దశలో కేవలం నెదర్లాండ్స్‌తో మ్యాచ్ మిగిలి ఉంది. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో నెంబర్ 4 జట్టుతో భారత్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ వరల్డ్ కప్లో టీమిండియా గెలవడమే కాదు.. అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శనను చూపిస్తుంది. దీంతో ప్రత్యర్థి జట్లను ఓడించి ఏకపక్షంగా చాలా మ్యాచ్‌లను గెలుచుకుంది. టీమిండియా ఈ అద్భుతమైన ప్రదర్శనకు కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఆ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: World cup 2023: ఆకాశమే హద్దుగా చెలరేగిన లంక బ్యాట్స్మెన్ .. వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్థానం
వన్డే ఫార్మాట్‌లో టీమిండియా నంబర్-1లో ఉంది.
టెస్టు ఫార్మాట్‌లో టీమిండియా నంబర్-1 స్థానంలో ఉంది.
టీ20 ఫార్మాట్‌లో టీమిండియా నంబర్-1 స్థానంలో ఉంది.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల స్థానం
బ్యాట్స్‌మెన్ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ నంబర్-1 స్థానంలో ఉన్నాడు.
బౌలర్ల వన్డే ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ నంబర్-1లో ఉన్నాడు.
టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ నంబర్-1లో ఉన్నాడు.
బౌలర్ల టెస్టు ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ నంబర్-1లో ఉన్నాడు.
ఆల్ రౌండర్ల టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా నంబర్-1 స్థానంలో ఉన్నాడు.
Read Also: Salaar: సలార్ స్పెషల్ నెంబర్ కోసం ‘డర్టీ గాళ్’
ఈ నంబర్-1 జాబితాలో క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో టీమిండియా నెంబర్ 1 జట్టుగా ఉంది. ఇక ఈ వరల్డ్ కప్ లో ఆడే టీమిండియాలో ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, ప్రపంచ నెంబర్ 1 బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈ వరల్డ్ కప్ లో ఆడుతున్నారు. ఇక ఫీల్డింగ్ లో రవీంద్ర జడేజా ప్రపంచంలోనే నెంబర్ 1 ఫీల్డర్ గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ను ఓడించి టైటిల్ గెలుచుకోవడం ఏ జట్టుకైనా కష్టమైన పని. చూడాలి మరీ ఈ వరల్డ్ కప్ లో ఫైనల్ లో ఏ జట్టు గెలుస్తుందో…..